న్యూ ఇయర్ సందర్భంగా దగ్గరగా ఉన్నవారికి విషెస్ చెప్పుకోవడం మాములే. కానీ దూరంగా ఉన్నవారికి చెప్పాలంటే మాత్రం అందరు కూడా వాట్సాప్‌ ను ఉపయోగిస్తున్నారు. దీని వలన వాట్సాప్‌ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలతో కూడిన మెసేజ్‌లు పోటెత్తాయి. న్యూ ఇయర్ విషెస్ చెప్పుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభా వాట్సాప్‌ ను ఉపయోగించి ఒక్కరోజే 10,000 కోట్ల మెసేజ్ లు పంపించుకున్నారు. ఒక రోజులోనే ఈ స్థాయిలో మునుపెన్నడూ మెసేజ్ లు ఎక్స్ఛేంజ్‌ జరగలేదు ఇదే అత్యధిక రికార్డ్.

అదేవిధంగా దీంట్లో 2,000 కోట్ల మెసేజ్ లు భారతీయులే పంపడం మరో విశేషం. కొత్త సంవత్సరం ప్రవవేశించే అర్ధరాత్రి 24 గంటల సమయం వరకు ప్రపంచవ్యాప్తంగా 10,000 కోట్ల మెసెజ్ లు షేర్ అయ్యాయని వాట్సాప్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.