వాట్సాప్‌.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి చేరువైంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది. తాజాగా యూజర్ల కోసం మరిన్ని మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి రాగా, మరికొన్ని బీటా దశలో ఉన్నాయి. వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం ప్రతి ఏడాది సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. మున్ముందుకు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. చాలా మందికి వాట్సాప్‌ యూజర్లు ఇప్పటికే వాట్సాప్‌లోని బోల్డ్‌, ఇటాలిక్స్‌, స్టెక్‌-త్రూ ఫాంట్‌ల గురించి తెలుసు. ఎప్పుడో ఇది అందుబాటులోకి వచ్చింది.

వేర్వేరు డివైజ్‌లలో ఒకేసారి..

ఈ ఫీచర్‌ కోసం చాలా మంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో లాగిన్‌ కావాలనుకునే వారికి ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మొబైల్‌తో పాటు డెస్క్‌ టాప్‌లో లాగిన్‌ అయ్యేందుకు అవకాశం ఉంది. త్వరలో మల్టీ డివైజ్‌ సపోర్టు ఫీచర్‌తో ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో లాగి అయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల యూజర్లకు ఎంతో ఉపయోగమని చెప్పాలి.

ఒకేసారి 50 మందితో..

గూగుల్‌ మీట్‌, జూమ్‌ యాప్ తరహాలో వాట్సాప్‌ కూడా ఒక వీడియో కాల్‌లో ఒకేసారి 50 మందితో మాట్లాడుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అలాగే గ్రూప్‌ క్రియేట్‌ చేసి ఇతరులకు వాట్సాప్‌ వెబ్‌ లేదా డెస్క్‌ టాప్‌ నుంచి ఇన్‌వైట్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది.

కొత్త ఎమోజీలు

రోజులు మారిన కొన్ని వాట్సాప్‌ సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఎమోజీలతో తమ భావాలను వ్యక్తపరిచే వారి కోసం కొత్తగా 138 ఎమోజీలను వాట్సాప్‌ తీసుకువస్తోంది. ప్రస్తుతం అవి వాట్సాప్‌ అండ్రాయిడ్‌ బీటా వెర్షన్ యాప్‌ ఉపయోగించే వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే కొత్తగా నాలుగు యానిమేటేడ్‌ స్టిక్కర్‌ ప్యాక్స్‌ను సైతం కూడా యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.