త్వరలో వాట్సాప్ మల్టీ ఫీచర్

By రాణి  Published on  30 April 2020 1:09 PM GMT
త్వరలో వాట్సాప్ మల్టీ ఫీచర్

వాట్సాప్ వినియోగదారులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి రెండు ఫోన్లలో ఒకే నంబర్ పై వాట్సాప్ ను ఉపయోగించడం సాధ్యం కాని పని. ఒకవేళ ఒకేసారి రెండింటింలో వాట్సాప్ ను వాడాలంటే ఉన్న ఒకేఒక్క సదుపాయం వెబ్ వాట్సాప్. ఇప్పుడు ఇలా ఒకేసారి రెండింటిలో ఒకే వాట్సాప్ అకౌంట్ ను వాడేలా మల్టీ డివైజ్ సపోర్ట్ ను యాజమాన్యం అందుబాటులోకి తీసుకురానుంది. నిజానికి ఇది గతేడాది అందుబాటులోకి రావాల్సి ఉన్నా..కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ వినియోగదారుల్ని సంతృప్తి పరిచేందుకు ఆ సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది వాట్సాప్. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఫోన్, టాబ్లెట్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు కలిగి ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read : 11 ఏళ్ల రికార్డును దాటిన సెన్సెక్స్..

వాట్సాప్ ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఒక నిత్యావసరమైపోయింది. తిండి తిప్పలు లేకుండా అయినా ఉంటారేమో గానీ..ఒక్క క్షణం వాట్సాప్ లేకపోతే ఉండలేకపోతోంది యువత. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఈ వాడకం మరింత ఎక్కువైంది. గ్రూప్ ఛాట్స్, గ్రూప్ వీడియో కాల్స్, ఎవరికి ఏ విషయం చెప్పాలన్నా వాట్సాప్ నే బాగా వాడుతున్నారు. వాడటం మంచిదే..కానీ అది మనకి చేటు చేయనంతవరకే. ఏది ఎంత వరకూ వాడాలో అంతవరకే వాడితే ఆరోగ్యానికి, జీవితానికి కూడా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

Also Read :చంద్రబాబు పీఏ పై కేసు నమోదు

Next Story