లెబనాన్‌లో 'వాట్సాప్ ' విప్లవం..! ప్రధాని రాజీనామా..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 12:31 PM GMT
లెబనాన్‌లో వాట్సాప్  విప్లవం..! ప్రధాని రాజీనామా..!!

ముఖ్యాంశాలు

  • లెబనాన్ ను కదిలించిన వాట్సాప్ విప్లవం
  • ఫ్రీ కాల్స్ పై లెబనాన్ ప్రభుత్వం పన్ను
  • తిరగబడ్డ ప్రజలు, ప్రధాని రాజీనామా..!

వాట్సాప్ కాల్స్ ఉచితం. ఇది జగమెరిగిన సత్యం. అయితే...లెబనాన్‌ ప్రభుత్వం మాత్రం వాట్సాప్ కాల్స్‌పై పన్ను విధించాలని నిర్ణయించింది. దీంతో ప్రజల్లోంచి విప్లవం పుట్టుకొచ్చింది. లక్షల మంది వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతులను మరిచి..జాతీయ జెండాలు చేతబూని విప్లవ శంఖారావం పూరించారు.

Copy of 2019-11-02T172100Z_2219546_RC1CEAD1EC00_RTRMADP_3_LEBANON-PROTESTS-1572778072426

ఈ ఉద్యమం దేశం మొత్తం పాకింది.దీంతో లెబనాన్‌ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. వాట్సాప్ కాల్స్‌పై పన్ను విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయినా..ఉద్యమం ఆగలేదు. చివరకు ప్రధాని కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రజల మధ్య ఐక్యతను దెబ్బ తీయడానికి వాట్సాప్ కాల్స్‌పై నిషేధం విధిస్తే..చివరకు ప్రధానే రాజీనామా చేయాల్సి వచ్చింది.

Whatsapp Revolution in Lebanon Challenges Govt - Sakshi

1943లో లెబనాన్‌ ప్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం సంపాదించింది. దేశంలో క్రైస్తవులు , ముస్లింలు ఉన్నారు. 1970 - 90 మధ్య అంతర్యుద్ధంతో లెబనాన్ నలిగి పోయింది. జాతుల మధ్య ఒప్పందాలు కుదరడంతో అంతర్యుద్ధం ముగిసింది.

Copy of 2019-11-02T171953Z_992306225_RC164F9B85D0_RTRMADP_3_LEBANON-PROTESTS-1572778068764

Next Story