చేతిలో ఫోన్‌ ఉంటే దానిలో వాట్సాప్ ఉండాల్సిందే. వాట్సాప్ క్రేజ్ అంతా ఇంతా కాదు.  న్యూ ఫీచర్స్‌తో వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు మార్చుకుంటుంది. తాజాగా..వాట్సాప్ స్టేటస్ డైరక్ట్‌గా ఫేస్ బుక్‌లో షేర్ చేసుకోవచ్చు. భలే ఫీచర్ కదూ. అందుకే ఈ వాట్సాప్‌ నిర్వాహకులు తమ కస్టమర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆండ్రాయిడ్, ఐఫోన్‌ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్పాప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటిని ‘షేర్ టు ఫేస్ బుక్ స్టోరీ’బటన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఫేస్ బుక్‌లో స్టోరీలుగా మార్చవచ్చు. స్టేటస్ అప్ డేట్ తరువాత కుడి వైపున ఉండే మూడు చుక్కలను క్లిక్ చేయాలి. అప్పుడు ‘షేర్ టు ఫేస్ బుక్‌ స్టోరీ’ కనిపిస్తోంది. దీనిపై క్లిక్‌ చేయగానే ఆటోమేటిక్‌ గా ఆ స్టేటస్ ఫేస్ బుక్‌లో కనిపిస్తోంది. ఈ ఫీచర్ ఇప్పుడు వాట్పాప్ కస్టమర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.