రెవెన్యూ శాఖను ఏం చేసేందుకు చూస్తున్నారు: తమ్మినేని వీరభద్రం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 11:48 AM GMT
రెవెన్యూ శాఖను ఏం చేసేందుకు చూస్తున్నారు: తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె 39వ రోజుకు చేరుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం మంచిది కాదన్నారు. కేసీఆర్‌ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం మరింత పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ రెండో సారి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. దశల వారిగా ఒక్కొక్కరు ఆందోళన బాట పడుతున్నారని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మరోవైపు రెవెన్యూ ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నారన్నారు. రెవెన్యూ శాఖను తన దగ్గర పెట్టుకొని మరింత బలోపేతం చేస్తానని చెప్పిన సీఎం.. రెవెన్యూ శాఖను మీరు ఏం చేసేందుకు చూస్తున్నారని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్న వారికి తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

Next Story