కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. చైనాలో ప్రారంభమై ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన ఈ వైరస్‌.. ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. సుమారు 149 దేశాల్లో ఈ వైరస్‌ ఉగ్రతాండవం చేస్తోంది. ఫలితంగా లక్షన్నర మంది ఈ వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతుండగా 5వేలకు పైగా ఈ వైరస్‌ భారిన పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు హై అలర్ట్ ను ప్రకటించాయి. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ ఈ వైరస్‌ కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్‌ ఒంట్లోకి చేరిన తర్వాత ఏమౌతుంది. ఎలా మనిషిని కృంగదీస్తుంది. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా తెలుస్తాయి. ఏ దశలో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనే విషయాలను మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ కీలక సమాచారాన్ని ప్రచురింది. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు దినప్రతికలో కథనం ప్రచురితమైంది.

Also Read :ట్రంప్‌కు కరోనా పరీక్ష.. ఫలితాలు వెల్లడించిన శ్వేతసౌధం!

కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి 1 నుంచి మూడు రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి. మొదట్లో ముక్కు, గొంతు ద్వారా శ్వాస కోశ సమస్యల లక్షణాలు కనిపిస్తాయి. మొదటి రోజే కొద్దిగా జ్వరం వస్తుంది. మూడో రోజు నుంచి దగ్గు, గొంతు నొప్పి ప్రారంభం అవుతాయి. బాధితుల్లో ఇలాంటి లక్షణాలు 80శాతం మందిలో కనిపిస్తాయి. ఇక నాలుగు నుంచి 9రోజుల్లో ఈ వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది.  దీంతో శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది. ఆ తరువాత ఎనిమిది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఊపిరితిత్తులు వాచి తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తే అవకాశముంది. వైరస్‌ బాధితుల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్లు 14శాతం మంది ఉంటున్నారు.

Also Read :కరోనాపై దుష్ప్రచారం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..!

8 నుంచి 15 రోజులు ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి చేరుతుంది. వారం ముగిసేసరికి విషతుల్యమై ప్రాణహాని స్థాయికి చేరుతుంది. ఐసీయూలో చేరాల్సిన అవసరం వస్తున్న వారు 5శాతం మంది ఉంటున్నారు.  ఇదిలా ఉంటే మూడోవారం అత్యంత కీలక దశగా పేర్కొంటున్నారు. 21 రోజుల తర్వాత బాధితుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడమో, అరుదుగా చనిపోవడమో జరుగుతుంది. సహజంగా 18-25 రోజుల మధ్య వ్యాధి లక్షణాలు తగ్గి బాధితులు ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇలా సురక్షితంగా బయటపడుతున్న బాధితుల సంఖ్య 95శాతం కంటే అధికమేనట. సాధారణంగా 15-22 రోజుల మధ్య వ్యాధి లక్షణాలు, బాధితుల చనిపోతున్నారు. ఇదీ ఇతరత్రా జబ్బులున్న వారిలోనే ఎక్కువ. ఇప్పటి వరకు ఇలాంటి మరణాల రేటు అత్యల్పంగా నమోదుతోంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.