సమావేశంలో ఏం చర్చించారు..? భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 11:52 AM GMT
సమావేశంలో ఏం చర్చించారు..? భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది..?

హైదరాబాద్‌: కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు ముగిశాయి. ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ కార్మిక నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు, ఉన్నతాధికారులు, ఆర్టీసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం కొన్ని అంశాలపైనే చర్చలు జరుపుతామని చెప్పడంతో అర్థంతరంగా చర్చలు ముగిశాయి. 26 డిమాండ్లపై చర్చించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు పట్టుబట్టారు. అన్ని డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో సమావేశం నుంచి మధ్యలోనే ఆర్టీసీ జేఏసీ నేతలు బయటకు వచ్చారు. ఇవి నిర్బంధ చర్చలు, కోర్టు తీర్పును కూడా వక్రీకరించారని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. అన్ని అంశాలపై ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు.

డిమాండ్లపై చర్చలకు ఎప్పుడు పిలిచినా వస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందన్నారు. ఆర్‌ అండ్‌ బీ భవనం ప్రాంగణంలో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. యాజమాన్యం జరిపిన చర్చల సారాంశాన్ని జేఏసీలోని మిగతా నేతలతో అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చర్చిస్తున్నారు. కాసేపట్లో తదుపరి కార్యాచరణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించనుంది.

Next Story