రోడ్డు ప్రమాదంలో ఫాస్ట్‌బౌలర్‌కు గాయాలు
By Newsmeter.NetworkPublished on : 18 Feb 2020 7:16 PM IST

రోడ్డు ప్రమాదంలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఓసనే థామస్ గాయపడ్డాడు. జమైకాలోని ఓల్డ్ హార్బర్ హైవేపై అతను ప్రయాణిస్తున్న కారుని మరో వాహనం ఢీకొట్టడంతో థామస్‌కి గాయాలైనట్లు వెస్టిండీస్ ప్లేయర్స్ అసోషియేషన్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం థామస్ ఇంటి దగ్గర విశాంత్రి తీసుకుంటున్నట్లు అసోషియేషన్ తెలిపింది. ఐపీఎల్ 2020 సీజన్‌కి రాజస్థాన్ తరుపున బరిలోకి దిగనున్నాడు.
అయితే అప్పటికి కోలుకుంటాడని అతని సన్నిహితులు వెల్లడించారు. వాస్తవానికి ఈ ప్రమాదం ఆదివారం అర్ధరాత్రి జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ విండీస్ తరఫున 20 వన్డేలాడిన ఈ పేసర్ 27 వికెట్లు పడగొట్టాడు. అలానే ఆడిన 10 టీ20 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జనవరిలో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన థామస్‌కి.. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకి వెళ్లిన జట్టులో చోటు లభించలేదు.
Next Story