రక్తం మరిగిన రోడ్డు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 7:05 AM GMT
రక్తం మరిగిన రోడ్డు..!

  • ప.గో. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఆరుగురు మృతి, నలుగురికి గాయాలు

నల్లజర్ల: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖకు చెందిన 11 మంది కుటుంబ సభ్యులు వ్యాన్‌లో వెళ్తుండగా..లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు చిన్నారులు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story
Share it