శభాష్ పోలీస్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 9:28 AM GMT
శభాష్ పోలీస్..!

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ మండలం పెద్ద తూప్ర గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు టేకుమళ్ళ చంద్రయ్య సాయంత్రం నాలుగు గంటల సమయంలో చెట్టు ఆకుల కోసం గ్రామ శివారులో ఉన్న బావివద్దకు వెళ్ళాడు.

బావి అంచున ఉన్న చెట్టు ఆకులను తెంపుతూ ప్రమాదవశాత్తూ జారి బావిలో పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. కానిస్టేబుల్స్ కృష్ణమాచారి, శ్రీశైలం, కృష్ణ, నరేష్ లు తాడు సహాయం బావి లోపలికి దిగారు.

అంతకు ముందే 108 సమాచారం ఇచ్చారు. ఈ లోపు క్రేన్ కూడా వచ్చింది. క్రేన్‌ సహయంతో వృద్ధుడు చంద్రయ్యను బయటకు తీశారు. అనంతరం 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బావిలో పడిన వృద్ధుడిని కాపాడినందుకు స్థానికులు పోలీసులను ప్రశంసించారు.

Next Story
Share it