వెబ్‌సైట్ల పాస్‌వర్డ్‌లు వెంటనే మార్చుకోండి.. లేకపోతే..

By సుభాష్  Published on  23 Dec 2019 10:58 AM GMT
వెబ్‌సైట్ల పాస్‌వర్డ్‌లు వెంటనే మార్చుకోండి.. లేకపోతే..

ఆన్‌లైన్‌ చోరీలు అధికమయ్యాయి. ముఖ్యంగా భారత్‌లో వెబ్‌సైట్లు ఉపయోగించేవారి పాస్‌వర్డ్ లు అధికంగా చోరీలకు గురవుతున్నాయి. వాటిని వెంటనే మార్చుకోవాలని గూగుల్‌ యుజర్లకు సూచిస్తోంది. మీడియా సంస్థల నుంచి సామాన్య ప్రజలు ఇలా చాలా మంది ల్యాబ్‌టాప్‌లు, డెస్కుటాప్‌లు, మొబైలపై ఈ గూగుల్‌ నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి. డేటా కారణంతో పాస్‌ వర్డ్‌ లు చోరీకి గురవుతున్నాయని గూగుల్‌ అభిప్రాయపడింది.

ఆహార ఉత్పత్తులు విక్రయించే ప్రెష్‌ హోం అనే ఈ కామర్స్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ కాగా, వార్నింగ్‌ పాప్‌ అప్‌ వచ్చినట్లు ఓ యూజర్‌ ద్వారా తెలుస్తోంది. తమ గ్రూప్‌కు చెందిన ఓ పోర్టర్‌లో లాగిన్‌ చేసే సమయంలో ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. క్రోమ్‌ 79లో బగ్‌ను గూగుల్‌ సరిచేసేందుకు ప్రయత్నించగా, మళ్లీ ఈ పాస్‌వర్డ్‌ ల అలర్డ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మరింత భద్రత కల్పించే దిశగా క్రోమ్‌ 79 బ్రౌజర్‌ను గూగుల్‌ సరి చేసింది. ఏదేమైనా వెబ్‌సైట్లు ఉపయోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే డేటా మొత్తం చోరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సూచిస్తోంది.

Next Story