వెబ్‌సైట్ల పాస్‌వర్డ్‌లు వెంటనే మార్చుకోండి.. లేకపోతే..
By సుభాష్ Published on 23 Dec 2019 10:58 AM GMTఆన్‌లైన్ చోరీలు అధికమయ్యాయి. ముఖ్యంగా భారత్‌లో వెబ్‌సైట్లు ఉపయోగించేవారి పాస్‌వర్డ్ లు అధికంగా చోరీలకు గురవుతున్నాయి. వాటిని వెంటనే మార్చుకోవాలని గూగుల్ యుజర్లకు సూచిస్తోంది. మీడియా సంస్థల నుంచి సామాన్య ప్రజలు ఇలా చాలా మంది ల్యాబ్‌టాప్‌లు, డెస్కుటాప్‌లు, మొబైలపై ఈ గూగుల్ నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి. డేటా కారణంతో పాస్ వర్డ్ లు చోరీకి గురవుతున్నాయని గూగుల్ అభిప్రాయపడింది.
ఆహార ఉత్పత్తులు విక్రయించే ప్రెష్ హోం అనే ఈ కామర్స్ పోర్టల్‌లోకి లాగిన్ కాగా, వార్నింగ్ పాప్ అప్ వచ్చినట్లు ఓ యూజర్ ద్వారా తెలుస్తోంది. తమ గ్రూప్‌కు చెందిన ఓ పోర్టర్‌లో లాగిన్ చేసే సమయంలో ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. క్రోమ్ 79లో బగ్‌ను గూగుల్ సరిచేసేందుకు ప్రయత్నించగా, మళ్లీ ఈ పాస్‌వర్డ్ ల అలర్డ్ వచ్చినట్లు తెలుస్తోంది. మరింత భద్రత కల్పించే దిశగా క్రోమ్ 79 బ్రౌజర్‌ను గూగుల్ సరి చేసింది. ఏదేమైనా వెబ్‌సైట్లు ఉపయోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే డేటా మొత్తం చోరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సూచిస్తోంది.