హైదరాబాద్: ఈ సీజన్‌లో నైరుతి రుతు పవనాలు అక్టోబర్‌ మొదటి వారం వరకు ఉండే అవకాశాలు కల్పిస్తున్నాయి. అప్పటివరకు రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి రాష్ట్రంపై 5.8 కి.మీ ఎత్తులో కేంద్రీకృతం కావడం వల్లనే..భారీ వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. రాగల మూడు రోజుల్లో చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రాజారావు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.