నిజమెంత: లాక్ డౌన్ ను ప్రకటించడంతో ప్రజలు సూపర్ మార్కెట్ ను లూటీ చేశారా..?

By సుభాష్  Published on  14 April 2020 8:30 AM GMT
నిజమెంత: లాక్ డౌన్ ను ప్రకటించడంతో ప్రజలు సూపర్ మార్కెట్ ను లూటీ చేశారా..?

కోవిద్-19 వైరస్ తమ తమ దేశాల్లో ప్రబలకుండా ఉండడానికి ఆయా దేశాల్లో లాక్ డౌన్ ను అమలుచేస్తూ ఉన్నారు. వైరస్ ప్రజల్లో ప్రబలకుండా ఉండాలంటే ఇదే ఆయుధమని నమ్ముతున్నారు దేశాధినేతలు. సౌత్ ఆఫ్రికా దేశంలో కూడా గత కొద్ది వారాలుగా లాక్ డౌన్ అమలు అవుతోంది.



ఇటువంటి పరిస్థితుల్లో.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ప్రజలు ఓ సూపర్ మార్కెట్ లోకి చొరబడి.. ఆ సరుకులన్నిటినీ తీసుకుని వెళ్లిపోయారు. సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకున్నదీ ఘటన అంటూ.. లాక్ డౌన్ ను ఆ దేశంలో విధించడంతో ప్రజలు ఇలా ప్రవర్తించారు. "మనం కూడా ఇలాంటి పరిస్థితులు జరగకుండా జాగ్రత్త పడాలి.. సౌత్ ఆఫ్రికా లాగా మనం ఫెయిల్ అవ్వకూడదు.. అక్కడ సూపర్ మార్కెట్లపై పడి.. ప్రజలు ఇలా లూటీ చేస్తున్నారు" అని వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఓ వెబ్ సైట్ లో న్యూస్ ఆర్టికల్ గా పోస్టు చేశారు.

https://reporterspressng.com.

https://reporterspressng.com/tag/hungry-south-africans-loots-supermarket-as-21-days-lockdown-collapse-video/

అలాగే ఈ వీడియో ఫేస్ బుక్ లో కూడా వైరల్ అయ్యింది.

నిజమెంత:

సోషల్ మీడియాలో చెబుతున్నదంతా 'పచ్చి అబద్దం'

ఇన్విడ్ టూల్ ను ఉపయోగించి వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను సెర్చ్ చేయగా ఆ వీడియో గతంలోనే సోషల్ మీడియాలో పబ్లిష్ చేశారు. మే 2018న యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. “South Africa, storm a supermarket” పేరుతో ఆ వీడియోను అప్లోడ్ చేశారు.

2019 సెప్టెంబర్ లో కూడా మరోసారి అదే వీడియోను అప్లోడ్ చేశారు.

“Looting in BP garage Chatsworth, Durban, South Africa” అని వీడియోను అప్లోడ్ చేసారు.

ఈ వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను కూడా ఫేస్ బుక్ లో అప్లోడ్ చేశారు. CICA (క్రైమ్ ఇంటెలిజెన్స్ & కమ్యూనిటీ అవేర్నెస్) సంస్థ వీడియోను అప్లోడ్ చేసింది. సౌత్ ఆఫ్రికా మిఛెల్స్ ప్లైన్ లో ఉన్న బిపి క్లాక్ టవర్ 'పిక్ ఎన్ పే ఎక్స్ప్రెస్' ను లూటీ చేశారు.



ఆ వీడియో యూట్యూబ్ లింక్ చూడొచ్చు:

ఆ వీడియోకు సంబంధించిన విషయాన్ని లోకల్ వెబ్ సైట్లలో పెట్టారు కూడానూ..

https://www.news24.com/SouthAfrica/News/mitchells-plain-business-owners-devastated-by-overnight-looting-vandalism-20180529

ఈ ఘటన 2018 మే నెలలో చోటుచేసుకుంది. మిఛెల్స్ ప్లైన్ లో ఉన్న బిపి క్లాక్ టవర్ ను లూటీ చేశారని ఆ వార్తల్లో పేర్కొన్నారు.

ఆ వీడియో దాదాపు రెండు సంవత్సరాల క్రితం వీడియో..! కరోనా వైరస్ మహమ్మారికి ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. అనవసరంగా ఇలాంటి పరిస్థితుల్లో అబద్ధపు వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు.

కాబట్టి వైరల్ అవుతున్న వీడియో 'పచ్చి అబద్ధం'

Next Story