రోడ్డుకు అడ్డంగా గోడ.. పరిశీలించనున్న మానవహక్కుల కమిషన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2019 12:11 PM ISTగుంటూరు: నేడు జిల్లాకు జాతీయ మానవ హక్కుల బృందం రానుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో ఇవాళ జాతీయ మానవ హక్కుల బృందం పర్యటించనుంది. పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను బృందం సభ్యులు పరిశీలించనున్నారు. టీడీపీ వర్గీయుల ఇళ్లకు వెళ్లకుండా వైసీపీ నేతలు గోడ కట్టారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి వివాదం కొనసాగుతుంది. పొనుగుపాడు, ఆత్మకూరు, పిన్నెల్లి గ్రామాలను మానవహక్కుల కమిషన్ పరిశీలించనుంది. ఢిల్లీకి వెళ్లి టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీ.వి ఆంజనేయులు, జిల్లా టీడీపీ నేతలు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ క్షేత్రస్థాయి పర్యటన కోసం జిల్లాకు రానున్నది.
Next Story