విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలొ ఉంది. 502/7 వద్ద కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లే ర్ చేశాడు. రవీంద్ర జడేజా (30, 46 బంతులు),రవిచంద్ర అశ్విన్‌ (1, 17బంతులు) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు మయాంక్ అగర్వాల్ (215, 371 బంతులు) ద్విశతకం బాదేశాడు. రోహిత్ శర్మ (176,244 బంతులు),పూజారా (6), కోహ్లీ (20), రహానే (15), హనుమవిహరి (10) వృద్ధిమాన్ సాహూ (21) అంతగా రాణించలేక పోయారు. దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ 3 వికెట్లు తీశాడు. ఫిలాండ్, డేన్ ఫీడ్, ముత్తుస్వామి, ఎల్గర్ తలో వికెట్ తీశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.