టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలరాజు విశాఖ బీచ్ రోడ్ లో కారుతో హల్ చల్ చేశారు. ఫూటుగా తాగి వేగంగా కారు డ్రైవ్ చేశాడు. మితిమీరిన వేగంతో వెళ్లి టూ వీలర్ కు యాక్సిడెంట్ చేశాడు. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతనిని ఆస్పత్రికి తరలించారు. వాహన వేగానికి కారు డివైడర్ పై నుంచి దూసుకెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు అద్దాలు పగిలి పార్శ్వంగా ధ్వంసమయింది. ప్రమాదాన్ని గుర్తించిన వాకర్స్ అప్పలరాజుకు దేహశుద్ధి చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడ వాకర్స్ ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన అప్పలరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.