విశాల్‌ కెరీర్ లోనే 'యాక్షన్' మూవీ హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది- నిర్మాత శ్రీనివాస్‌ ఆడెపు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 6:36 AM GMT
విశాల్‌ కెరీర్ లోనే యాక్షన్ మూవీ హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది- నిర్మాత శ్రీనివాస్‌ ఆడెపు

'యాక్షన్' మూవీతో నిర్మాతగా మారారు శ్రీనివాస్‌ ఆడెపు. హుషారు, కబాలి, ఇస్మార్ట్‌ శంకర్‌, గద్దలకొండ గణేష్‌, రాజుగారిగది3 వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతం మాస్‌ హీరో విశాల్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సుందర్‌ సి. దర్శకత్వంలో, శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్‌ ఆడెపు మాట్లాడుతూ...

నేను గత 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ చేశాను. తర్వాత డైరెక్టర్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ క్రమంలోనే బి ఏ రాజు గారి బేనర్లో వచ్చిన 'గుండమ్మగారిమనవడు' చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశానని తెలిపారు. తరువాత 6 -7 సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా..తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా చేశానన్నారు. అలాగే ఇప్పుడు యాక్షన్ చిత్రంతో నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాను.

యాక్షన్ మూవీ ఆడియన్స్ కి, విశాల్ అభిమానులకి ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుందన్నారు. ఈ సినిమా నేను తీసుకోవడానికి ఈ సినిమా మేకింగ్ కూడా ఒక కారణమని తెలిపారు. అలాగే కెజీఎఫ్ సినిమాకు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంబు, రవి వర్మ ఈ సినిమాకు వర్క్ చేశారన్నారు. అలాగే విశాల్‌ కెరీర్‌లోనే 'యాక్షన్' మూవీ హైయెస్ట్ గ్రాసర్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు.

Next Story
Share it