సౌత్‌ కొరియా నుంచి విశాఖకు చేరుకున్న ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం

By సుభాష్  Published on  13 May 2020 10:20 AM GMT
సౌత్‌ కొరియా నుంచి విశాఖకు చేరుకున్న ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం

ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం విశాఖకు చేరుకున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ యాజమానితో పాటు 8 మంది సభ్యులతో కూడిన బృందం బుధవారం మధ్యాహ్నం సౌత్‌ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. వారికి ఎయిర్‌పోర్టులో స్క్రానింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. అలాగే వెంకటాపురంలో ఉన్న పరిశ్రమను సందర్శించనున్నారు. జరిగిన ప్రమాదంపై ఏ మేరకు నష్టం వాటిల్లిందో వారు అంచనా వేయనున్నారు. అలాగే ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు.

ఈ సందర్బంగా వారికి పోలీసులు భద్రత కల్పించారు. కాగా, ఈనెల 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్‌లో విష వాయువు లీకై 12 మంది మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టి మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం కూడా ప్రకటించిన చెక్కులను కూడా అందజేసింది. దీంతో పాలిమర్స్‌ కంపెనీపై కేసు నమోదైంది. దీంతో ఏపీ ప్రభుత్వం దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో వారు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.

Next Story
Share it