అక్కడి మహిళలకు గర్భం గండమే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2019 10:20 AM GMT
అక్కడి మహిళలకు గర్భం గండమే..!

* పురిటీలోనే గర్భ శోకం

* ప్రాణాలు తీస్తున్న పాలకుల వైఫల్యం

విశాఖపట్నం: అక్కడ గర్భందాల్చాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే..అక్కడ కనీస వైద్యసదుపాయాలు కూడా ఉండవు. డెలివరి టైమ్ వస్తే ప్రాణం ఉంటుందో పోతుందోననే భయం.అందుకే ..అక్కడ గర్భం అంటేనే భయపడే పరిస్థితి ఉంది.

శనివారం ఒక మహిళకు ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ..సరైన వైద్యం అందక ఆ శిశువు మరణించింది.

న్యూస్ మీటర్ కు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం..ఇద్దరు కూలీ పనులు చేసుకునే మహిళలకు నొప్పులు వచ్చాయి. గర్భిణీలైనా వంతల జ్యోతి, కొర్రా కుసులమ్మలకు ఉదయం నుంచే పురుటి నొప్పులు మొదలయ్యాయి. వీరి గ్రామం వైసంపలు ...మినుములూరు ప్రభుత్వ ఆసుపత్రికి 15 కి.మీ దూరంలో ఉంది. గ్రామం నుంచి మినుమూలూర్ వరకు వాహనాల రాకపోకలకు రహదారులు లేవు. దీంతో ఇద్దరు మహిళలను అక్కడి గ్రామస్థుల సహకారంతో కొంత దూరం బైక్‌లపై తీసుకెళ్లారు. మరికొంత దూరం నడిచి ఆశా వర్కర్‌ సహాయంతో ఆసుపత్రికి తరలించారు.

అయితే ..గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి చేరుకునే ముందే జ్యోతి ప్రసవ నొప్పులు తట్టుకోలేక ఆడ శిశువును రోడ్డుపై ప్రసవించింది. కానీ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో శిశువు మరణించింది. మరో గర్భిణీ మహిళ కసులమ్మ తో పాటు బిడ్డను కోల్పోయిన జ్యోతిని కూడా చికిత్సకోసం మినుములూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

జ్యోతి బంధువులు తమ గ్రామానికి రహదారులు లేకపోవడంతోనే ఇలాంటి ప్రరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు.

Next Story