దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లేడీ డాక్ట‌ర్ హత్యాచార ఘటనను భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఖండించాడు. ఈ ఘ‌ట‌న సభ్య సమాజం సిగ్గు పడాల్సిన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లో ఇటువంటి సంఘటన జరగడం ఎంతో సిగ్గుచేటని అన్నారు. అంతేకాకుండా.. మనమంతా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి ఇటువంటి అమానవీయ ఘ‌ట‌న‌ల‌ను అడ్డుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది’ అని విరాట్‌ ట్విటర్ ద్వారా పిలుపునిచ్చాడు.

కోహ్లీ గ‌తంలో కూడా ప‌లుమార్లు త‌న‌ భార్య అనుష్క శర్మను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయడంపై స్పందించాడు. అనుష్క‌ శర్మను లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేసే వారి ప‌ట్ల ఫైర‌య్యాడు. ప్రపంచకప్‌ సమయంలో మాజీ ఆటగాడు త‌న భార్య‌పై చేసిన‌ వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.