'విరాటపర్వం' మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథ అట !

By రాణి  Published on  30 Dec 2019 7:08 PM IST
విరాటపర్వం మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథ అట !

'నీది నాది ఒకే కథ' అనే చిన్న బడ్జెట్ సినిమాలో కొత్త ఎలిమెంట్స్ ను జోడించి మంచి హిట్ ను అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ 'వేణు ఉడుగుల'. అయితే ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ తన రెండో చిత్రంగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరో హీరోయిన్లుగా పెట్టి 'విరాటపర్వం' అనే పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా పేరుకు పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా ఈ సినిమాలో మాత్రం కొత్త కోణాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయట. ముఖ్యంగా రానా పాత్రలో పాజిటివ్ థింకింగ్ తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని.. అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని.. మొత్తంగా మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథనే.. థ్రిల్లింగ్ అంశాలతో ఓ న్యూ యాంగిల్ లో దర్శకుడు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణ ప్రాంతంలోని 1980 - 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాను దర్శకుడు రాసుకున్నాడు. అంటే అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనున్నారు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా నటిస్తోంది. అయితే సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. కానీ, రానాకి సంబంధించిన సీన్స్ ఇంకా షూట్ చేయాల్సి ఉంది. అన్నట్టు ఈ సినిమా తర్వాత రానా, దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య సినిమాని ప్రారంభించనున్నారట.

Next Story