విరాట్ @ 5కోట్లు
By Newsmeter.Network Published on 18 Feb 2020 12:56 PM IST
టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ క్రికట్ లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకున్నాడు. ఇక కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు. సోషల్ మీడియాలో కోహ్లి ఫాలోయింగ్ చూస్తే మతి పోవడం ఖాయం. ఇన్‌స్టాగ్రామ్ లో కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య తాజాగా 5 కోట్లకు(50 మిలియన్ల) చేరింది. తద్వారా ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన మొదటి భారతీయుడుగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ ఇప్పటివరకు ఇన్‌స్టాలో 930 పోస్టులు చేశాడు. రెండవ స్థానంలో ప్రియాంకా చోప్రా ఉన్నది. ప్రియాంకాకు 49.9 మిలియన్ల ఫోలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత 44.1 మిలియన్ల ఫాలోవర్లతో దీపికా పదుకునే మూడవ స్థానంలో ఉన్నది.
ఇక విరాట్.. ట్విట్టర్ లో 33.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా పేస్‌బుక్‌లో 37 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ బ్రాండ్ వాల్యూ 170.9 మిలియన్ డాలర్లకు చేరింది. దాంతో ఇండియా లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన సెలబ్రెటీల జాబితాలో కోహ్లీ మొదటి స్థానం లో నిలిచాడు.