డివిలియర్స్‌ క్లిక్‌.. విరుష్క జంట ఫోటో వైరల్‌

By సుభాష్  Published on  19 Oct 2020 8:19 AM GMT
డివిలియర్స్‌ క్లిక్‌.. విరుష్క జంట ఫోటో వైరల్‌

విరుష్క జంటకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు క్రికెట్‌లో, మరోకరు సినిమాల్లో బిజీగా ఉంటూనే వీలు చిక్కినప్పుడల్లా సరదాగా గడుపుతుంటారు. ఇక విరాట్‌ కోహ్లీ సోషల్ మీడియాలో మయా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తాజాగా విరాట్‌ షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2020లో భాగంగా విరాట్‌ దుబాయ్‌లో ఉండగా.. అనుష్క కూడా అక్కడే ఉంది. దీంతో ఇద్దరూ కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ ఫోటోలో విరాట్‌ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి సూర్యాస్తమ సమయంలో భుజాల వరకు నీటిలో మునిగి ఒకరి కళ్లోకి ఒకరు ప్రేమగా చూసూ ఫోటో దిగారు. ఈ ఫోటోకి మరో విశేషం కూడా ఉంది. ఈ ఫోటోని తీసింది మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ఏబీ డివిలియర్స్‌. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే క్యాప్షన్‌ రూపంలో తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అనుష్క పండండి బిడ్డకు జన్మనివ్వనుంది. మొదటిసారి తల్లిదండ్రులు కాబోతుండటంతో ఆ అనుభూతిని విరుష్క జంట ఆస్వాదిస్తోంది.

Next Story