పూర్తిగా తెలుసుకొని ప్ర‌శ్నించు.. జ‌ర్న‌లిస్టుపై కోహ్లీ ఆగ్ర‌హం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 March 2020 7:12 AM GMT
పూర్తిగా తెలుసుకొని ప్ర‌శ్నించు.. జ‌ర్న‌లిస్టుపై కోహ్లీ ఆగ్ర‌హం

రెండో టెస్ట్‌ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివ‌రాల్లోకెళితే.. రెండో టెస్ట్‌.. రెండవ‌ రోజు ఆట‌లో భాగంగా మైదానంలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తుంది. మైదానంలో అరుస్తున్న అబిమానుల వంక తిరిగి.. నోరు మూసుకోండి అన్న‌విధంగా కోహ్లీ సైగ చేశాడు. అయితే.. ఈ ఘ‌ట‌న‌కు సబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.

ఈ క్రమంలోనే.. ఓ జర్నలిస్టు ఈ ఘటనపై కోహ్లీని స్పందించాల్సిందిగా కోరారు. దీంతో అసహనానికి లోనైన కోహ్లీ.. జ‌రిగిన ఘ‌ట‌న‌ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రశ్నలు ఎలా అడుగుతారని పైర‌య్యారు.

కోహ్లీ, జ‌ర్న‌లిస్ట్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ :

జర్నలిస్టు : విరాట్ గ్రౌండ్‌లో ప్రవర్తనపై ఏం చెబుతారు? భార‌త‌ కెప్టెన్‌గా మీరు ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం భావ్యం కాదని మీకు అనిపించలేదా?

కోహ్లీ : దీనిపై మీరేమంటారు?

జర్నలిస్టు : నేను మిమ్మల్ని క్వ‌చ్ఛ‌న్ చేస్తున్నా?

కోహ్లీ : నేను స‌మాధానం మిమ్మల్నే అడుగుతున్నా?

జర్నలిస్టు : కెప్టెన్‌గా మీరు మంచి సాంప్ర‌దాయం నెలకొల్పాలి

కోహ్లీ : ఏం జరిగిందో ముందు మీరు పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకొని సరైనా ప్రశ్నలు అడగాలి. వివ‌రాలు తెలియ‌కుండా సగం సగం ప్రశ్నలు వేయ‌కండి. అయినా.. నేను మ్యాచ్‌ రిఫరీతో మాట్లాడాను. దానితో ఎలాంటి సమస్య లేదు. మీరు వివాదం చేయాల‌నుకుంటే ఇది స‌రైన వేధిక కాదంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.

అంత‌కుముందు.. కివీస్‌పై సరైన ప్రణాళికలు అమలు చేయకపోవడం వల్లే ఓట‌మి పాల‌య్యామని విరాట్‌ అన్నాడు. జ‌ట్టు ఆట‌గాళ్లు సమిష్టిగా రాణించ‌క‌పోవ‌డం కూడా ఓ కార‌ణ‌మ‌ని కోహ్లీ అంగీక‌రించాడు. అయితే ఈ సిరీస్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సి ఉందని కోహ్లీ తెలిపాడు.

Next Story