విమానంలో కుదుపులు.. సీట్ల నుంచి ఎగిరిపడి 30 మందికి గాయాలు

గాల్లో ఉన్న విమానం కుదుపులకు గురైంది. దాంతో.. ప్యాసింజర్స్‌ ఇబ్బంది పడ్డారు.

By Srikanth Gundamalla  Published on  2 July 2024 11:08 AM IST
Turbulence,  Flight, 30 passengers, injured ,

 విమానంలో కుదుపులు.. సీట్ల నుంచి ఎగిరిపడి 30 మందికి గాయాలు

ఈ మధ్యకాలంలో విమాన ప్రయాణాల్లో ప్రయాణికులు వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏసీలు పనిచేయకపోవడం వల్ల కొద్ది రోజులు నరకయాతన అనుభవించారు. అలాగే మరికొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా గాల్లో ఉన్న విమానం కుదుపులకు గురైంది. దాంతో.. ప్యాసింజర్స్‌ ఇబ్బంది పడ్డారు. విమానంలో సిట్లపై నుంచి ఎగిరి అటూ ఇటూ పడిపోయారు. ఒక వ్యక్తి ఓవర్‌హెడ్‌ బిన్‌ పడిపోయాడు. ఈ సంఘటనలో 30 మంది వరకు గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకు ఎయిర్‌ యురోపాకు చెందిన బోయింగ్ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో బయల్దేరింది. విమానం గాల్లో ఉన్న సమయంలో కుదిపులకు లోనయింది. ఈ క్రమంలో సీట్లు పెట్టుకోని పలువురు ప్రయాణికులు ఎగిపడిపోయారు. ముందు సీట్లకు తగిలారు. ఓ వ్యక్తి ఓవర్ హెడ్‌ బిన్‌లో పడిపోయాడు. చిన్నారులు,పెద్దలు తేడా లేకుండా అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పిల్లలు భయంతో ఏడుపు మొదలుపెట్టారు. ఈ సంఘటనతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బ్రెజిల్‌ లోని నాటల్ ఎయిర్‌పోర్టులో దింపారు. ఈ ఘటనలో హెడ్‌ బిన్‌లో పడిన వ్యక్తిని ఇతర ప్రయాణికులు కిందకు దించారు. మరో 30 మంది వరకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటనపై ఎయిర్‌ యురోపా సంస్ స్పందించింది. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు పేర్కొంది. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నట్లు ఎయిర్‌ యురోపా తెలిపింది.

ఈ విమానంలో ప్రయాణం చేసిన ఓ వ్యక్తి మాట్లాడాడు. ఐరోపా టూర్ ముగించుకుని తాను స్వదేశానికి వెళ్తుండగా జరిగిందన్నాడు. కుదుపుల గురించి కెప్టెన్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పాడు. సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించాడనీ.. సీట్‌ బెల్ట్ సరిగ్గా పెట్టుకోని వారు సీట్ల నుంచి నుంచి ఎగిరిపడిపోయారని తెలిపాడు. ఈ అనుభవంతో తాను ఎంతో భయపడ్డానని చెప్పాడు.

Next Story