సచిన్‌ విగ్రహంపై ట్రోల్స్.. స్మిత్‌లా ఉందంటూ కామెంట్స్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

By Srikanth Gundamalla  Published on  3 Nov 2023 6:30 AM GMT
trolls,  sachin tendulkar, statue,  mumbai,

సచిన్‌ విగ్రహంపై ట్రోల్స్.. స్మిత్‌లా ఉందంటూ కామెంట్స్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ ఫేవరెట్ షాట్లలో ఒకటైన స్ట్రెయిట్ లాఫ్టెడ్ షాట్ ఆడుతున్న విగ్రహాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆవిష్కరించారు. అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లే అనే శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా వాంఖడేలో అతని విగ్రహం ఏర్పాటు చేస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంది. అయితే.. ఈ విగ్రహంపై ట్రోల్స్‌ వస్తున్నాయి. సచిన్‌ పోలికలు లేవంటూ కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు. అభిమానులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్ ఏ షాట్ ఆడిన విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంసీఏ అధికారులు చాలా శ్రమ పడినట్లు తెలుస్తోంది. చివరకు ఈ స్ట్రెయిట్ లాఫ్టెడ్ షాట్ ఫొటోను ఎంపిక చేయగా.. సచిన్ కూడా ఇది బాగుందని చెప్పాడట. దీంతో ఇదే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. స్టేడియంలో సచిన్ స్టాండ్‌కు సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సచిన్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. దీన్ని చూసేందుకు చాలా మంది అభిమానులు చాలా ముందుగానే స్టేడియానికి వచ్చారు.

అంతాబాగానే ఉన్న సచిన్‌ విగ్రహంపై అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ విగ్రహం రూపు రేఖలు టెండూల్కర్‌ ముఖాన్ని పోలి ఉండటం కంటే.. స్మిత్‌ను గుర్తు చేస్తోందంటూ కామెంట్స్ చూఏస్తున్నారు. సచిన్‌ విగ్రహాన్ని సరిగ్గా రూపొందించలేందంటూ విమర్శలు చేస్తున్నారు. యావత్‌ భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కీర్తించే సచిన్‌ విగ్రహాన్ని తయారు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందని విగ్రహ రూపకర్తపై ఫైర్ అవుతున్నారు. ఇక కొందరు అయితే.. స్టీవ్‌ స్మిత్‌ విగ్రహం భారత్‌లో ఉందేందంటూ వ్యంగ్యమైన కామెంట్స్‌ చేస్తున్నారు. వాంఖడేలో గురువారం భారత్‌-శ్రీలంక మధ్య మ్యాచ్‌ జరిగినప్పటికీ నుంచి సచిన్‌ విగ్రహం పెద్ద చర్చనీయాంశమైంది.

Next Story