పోలీసు చెంప చెల్లుమనిపించిన ఎయిర్‌హోస్టెస్, యువతి అరెస్ట్

రాజస్థాన్‌లోని జైపూర్‌ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ పోలీసు అధికారి చెంప చెల్లుమనుపించింది ఎయిర్‌హోస్టెస్.

By Srikanth Gundamalla  Published on  12 July 2024 7:01 AM IST
spicejet ailines, employee, slap, cisf police,

 పోలీసు చెంప చెల్లుమనిపించిన ఎయిర్‌హోస్టెస్, యువతి అరెస్ట్ 

రాజస్థాన్‌లోని జైపూర్‌ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ పోలీసు అధికారి చెంప చెల్లుమనుపించింది ఎయిర్‌హోస్టెస్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. సీఐఎస్‌ఎఫ్‌ అధికారిక లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆ యువతి చెంపదెబ్బ కొట్టిందని విమానయాన సంస్థ ఉద్యోగికి రక్షణగా నిలిచింది. కాగా.. చివరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

స్పైస్‌జెట్‌లోని ఫుడ్ సూపర్‌వైజర్ అనురాధ రాణి తెల్లవారుజామున 4 గంటలకు వాహనం గేటు ద్వారా ఇతర ఉద్యోగులతో పాటు విమానాశ్రయంలోని ఎంట్రీ గేటు వద్దకు వచ్చారు. అక్కడే ఉన్న అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్ గిరిరాజ్‌ ప్రసాద్‌ స్పైస్‌ జెట్‌ ఉద్యోగులను ఆపాడు. ఆ గేటు ఉపయోగించడానికి సరైన అనుమతి లేదని చెప్పాడు. ఎయిర్‌లైన్ సిబ్బంది కోసం సమీపంలోని ప్రవేశ ద్వారం వద్ద స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించాడు.

ఆ సమయంలో స్క్రీనింగ్ ప్రాంతం చుట్టూ మహిళా పోలీసులు ఎవరూ లేరు. గిరిరాజ్‌ ప్రసాద్‌ మహిళా సిబ్బందిని స్క్రీనింగ్‌కు రమ్మని పిలిచాడు. మహిళా సిబ్బంది లేకపోవడంతో అనురాధ రాణి సీఐఎస్‌ఎఫ్‌ అధికారితో వాగ్వాదం పెట్టుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో సదురు ఉద్యోగిని సీఐఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గిరిరాజ్‌ను చెంపదెబ్బ కొట్టింది. కాగా... ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

అయితే, సీఐఎస్‌ఎఫ్ అధికారి ప్రసాద్‌పై నిందలు వేస్తూ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొంది. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ఇలా వివరించి.. "స్టీల్ గేట్ వద్ద క్యాటరింగ్ వాహనాన్ని ఎస్కార్ట్ చేస్తున్నప్పుడు, భారతదేశ పౌర విమానయాన భద్రత బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) జారీ చేసిన చెల్లుబాటు అయ్యే విమానాశ్రయ ప్రవేశ పాస్‌ను కలిగి ఉన్న మా మహిళా భద్రతా సిబ్బంది రెగ్యులేటర్, CISF సిబ్బంది ద్వారా అనుచితమైన మరియు ఆమోదయోగ్యం కాని పదజాలానికి లోనయ్యాడు, అతని ఇంటిలో డ్యూటీ తర్వాత వచ్చి కలవమని కోరడం కూడా ఉంది." అని పేర్కొంది. తమ మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

Next Story