అప్పన్న హుండీలో రూ.100 కోట్ల చెక్.. తీరా చూస్తే..

సింహాచలం అప్పన్న ఆలయంలో కాస్ట్‌లీ చెక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

By Srikanth Gundamalla  Published on  24 Aug 2023 10:31 AM GMT
Simhachalam Temple, Fake Cheque, Rs.100 Crore,

అప్పన్న హుండీలో రూ.100 కోట్ల చెక్.. తీరా చూస్తే..

సింహాచలం అప్పన్న ఆలయంలో కాస్ట్‌లీ చెక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. హుండీ తెరిచిన సిబ్బందికి ఏకంగా రూ.100 కోట్ల చెక్‌ కనిపించింది. పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్న చెక్ కనిపించడంతో ఆలయ అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ.. డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌ వద్దకు వెళ్లిన అధికారులు ఊహించని షాకింగ్ న్యూస్ విన్నారు. కోట్ల రూపాయలు కాదు కదా.. కనీసం రూ.100 కూడా లేవన్న అధికారుల మాటలతో ఖంగుతిన్నారు.

ఎక్కడైనా దేవస్థానాలకు వెళ్లినప్పుడు భక్తులు హుండీల్లో కానుకలు సమర్పిస్తారు. కొందరు బంగారం, వెండి రూపాల్లో కానుకలు ఇచ్చుకుంటే ఇంకొందరు.. డబ్బులు హుండీల్లో వేస్తారు. తమ కోర్కెలు నెరవేరాలని దేవుడుని కోరుకుంటారు. అయితే.. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తెలివిని ప్రదర్శించాడు. హుండీని కానుకగా సమర్పించాడు. ఏకంగా రూ.100 కోట్లను చెక్‌ రూపంలో రాసి హుండీలో వేశాడు.`

రాధాకృష్ణ అనే వ్యక్తి సింహాచలంలోని వరాహ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లి ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ ను హుండీలో వేశాడు. ఆ చెక్కును చూసిన అధికారులు ఇన్ని కోట్లు హుండీలో ఎందుకు వేసాడు అబ్బా అని ఆశ్చర్యపోయి వెంటనే అప్రమత్తమై అతని అకౌంట్ ను చెక్ చేశారు. బ్యాంకు అధికారులన సంప్రదించగా.. కేవలం 17 రూపాయల బ్యాలన్స్ మాత్రమే ఉన్నట్లుగా తెలియజేశారు. దాంతో ఆలయ అధికారులు, విషయం తెలుసుకున్న భక్తులు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇలాంటి ఫేక్‌ చెక్‌ను సమర్పించినందుకు సదురు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ న్యూస్‌ చదివి ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

Next Story