అయ్యో పాపం విరాట్ ఫ్యాన్.. చితకబాదిన సెక్యూరిటీ (వీడియో)
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి పరుగెత్తుకు వచ్చాడు
By Srikanth Gundamalla Published on 27 March 2024 11:19 AM GMTఅయ్యో పాపం విరాట్ ఫ్యాన్.. చితకబాదిన సెక్యూరిటీ (వీడియో)
ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. భారత్‌లోనే ఈ మ్యాచ్‌లు ఉండటంతో అభిమానులు పెద్ద ఎత్తున తమకు ఇష్టమైన టీమ్ మ్యాచ్‌లకు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. కొందరు యువత సడెన్‌గా స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చి క్రికెటర్లను కలుస్తుంటారు. కొందరు షేక్ ఇస్తారు.. ఇంకొందరు సెల్ఫీల కోసం ప్రయత్నిస్తుంటారు. డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఏకంగా తమ అభిమాన క్రికెటర్ పాదాలను టచ్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఈ నెల 25న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి పరుగెత్తుకు వచ్చాడు. ఆ మ్యాచ్‌లో తొలుత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. అయితే.. క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీని కలిసేందుకు ఆ అభిమాని పరుగెత్తుకు వచ్చాడు. అలా వచ్చిన అభిమాని విరాట్ కాళ్ల దగ్గర కింద పడిపోయి అతని పాదాలను తాకాడు. ఇక వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అక్కడి నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే నెట్టింట వైరల్ అయ్యింది. అతన్ని చూసిన ఫ్యాన్స్ అదృష్టవంతుడు అంటూ కామెంట్ చేశారు. తాజాగా సెక్యూరిటీ అతన్ని స్టేడియం బయట ఎలా వ్యవహరించారనే వీడియో బయటకు వచ్చింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఇతర క్రికెట్ అభిమానులంతా అయ్యో పాపం అంటున్నారు. విరాట్ పాదాలను తాకిన ఆ వ్యక్తిని స్టేడియం బయటకు తీసుకెళ్లి ఎవరూ చూడని చోట చితక బాదారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక నెటిజన్లలో కొందరు సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహాన్ని తప్పుబుడుతున్నారు. ఇంకా కొందరు మాత్రం వారి డ్యూటీ వారు చేశారంటూ సమర్ధిస్తున్నారు. విరాట్ కోహ్లీ దీనిపై స్పందించాలని.. ఫ్యాన్స్ పట్ల ఇలా దాడులు చేసే విధంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని కోహ్లీని ట్యాగ్ చేస్తున్నారు.