చోరీకి వెళ్తే రూపాయి లేదు..దాంతో రూ.20 ఇచ్చి వెళ్లిపోయిన దొంగ (వీడియో)

ఓ వ్యక్తి హోటల్‌లో చోరీకి వెళ్లాడు. పకడ్బంధీగా హోటల్‌లో ఎవరూ లేని సమయం చూసుకుని రెక్కీ చేసి మరీ వెళ్లాడు.

By Srikanth Gundamalla  Published on  27 July 2024 7:31 AM IST
rangareddy,   hotel, no money ,thief,  20 rupees,

చోరీకి వెళ్తే రూపాయి లేదు..దాంతో రూ.20 ఇచ్చి వెళ్లిపోయిన దొంగ 

ఓ వ్యక్తి హోటల్‌లో చోరీకి వెళ్లాడు. పకడ్బంధీగా హోటల్‌లో ఎవరూ లేని సమయం చూసుకుని రెక్కీ చేసి మరీ వెళ్లాడు. అయితే చోరీకి వెళ్లిన దొంగకు నిరాశే ఎదురైంది. అక్కడ రూపాయి కూడా దొరకలేదు. సహనం కోల్పోయిన దొంగ హోటల్‌లో అమర్చిన సీసీ కెమెరాలను గమనించి.. వాటిని చూస్తూ ఒక్క వాటర్ బాటిల్ మాత్రమే తీసుకుని రూ.20 పెట్టి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ దొంగకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ దొంగతనం సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఓ హోటల్‌లో జరిగింది. ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. చేతులకు గ్లౌజ్, ముఖానికి మంకీ క్యాప్‌ ధరించి చోరీకి ప్రవేశించాడు. తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశే ఎదురైంది. లోపల చోరీ చేసేందుకు ఏమీ దొరకలేదు. అన్ని రూములు కలియతిరిగాడు. కానీ.. అతనికి డబ్బు ఎక్కడా దొరకలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. వచ్చిన పని ఎలాగూ కాలేదనీ నిరాశపడ్డాడు. వెతికి వెతికి అలసిపోయిన దొంగ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఒక వాటర్ బాటల్ తీసుకని నీళ్లను తాగాడు. ఆ తర్వాత తనపై దొంగ అనే ముద్ర వేయించుకోవడం ఇష్టం లేక అక్కడ రూ.20 పెట్టి వెళ్లిపోయాడు. సీసీ కెమెరావైపు చూస్తూ ఒక్కటి కూడా దొరకలేదంటూ సైగలు చేశాడు. శ్వరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న భోజన హోటల్లో ఇటీవల చోటు చేసుకుంది. ఈ వీడియోలు శుక్రవారం వైరల్‌ అయ్యాయి.


Next Story