ఒకే ఫ్రేమ్‌లో ఎంఎస్ ధోనీ, రామ్‌చరణ్.. ఎందుకు కలిశారంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీని రామచరణ్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తుంది.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 6:10 PM ISTఒకే ఫ్రేమ్‌లో ఎంఎస్ ధోనీ, రామ్‌చరణ్.. ఎందుకు కలిశారంటే?
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్‌కు గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు వచ్చింది. అయితే.. ఆయన కొద్దిరోజుల క్రితం ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే. అయ్యప్ప మాల విరమణ కోసం చరణ్ ముంబైకి వెళ్లారని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీని రామచరణ్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తుంది. రామ్‌చరణ్, ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్.. వీరిద్దరూ ఎందుకు కలిశారా అని ఆలోచిస్తున్నారు. నెట్టింట ఇదే చర్చ జరుగుతోంది.
బుధవారం ఉదయం రామ్ చరణ్ ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్దివినాయక టెంపుల్‌ని సందర్శించారు. అయ్యప్ప మాల విరమణ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ సిబ్బంది కూడా రామ్‌చరణ్ రాకతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వినాయకుడిని రామ్‌చరణ్ దర్శించుకున్న తర్వాత శాలువాతో ఆయన్ని సత్కరించారు. ఆ తర్వాత రామ్‌చరణ్ , ఎంఎస్ ధోనీని కలిశారు. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. దాంతో.. ధోనీ, రామ్‌చరణ్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ఓ కమర్షియల్ యాడ్‌లో ఎంఎస్ ధోనీ, రామ్‌చరణ్ కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే రామ్‌చరణ్, ధోనీ కలిశారని సమాచారం అందుతోంది. ఇక ఆ యాడ్‌కు సంబంధించిన షూట్ తర్వాతే రామ్ చరణ్ హైదరాబాద్‌కు రానున్నారని తెలుస్తోంది.
కాగా.. ప్రస్తుతం రామ్‌చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పార్ట్ ఇంకా కొంత మిగిలి ఉంది. వంకర్ 'ఇండియన్-2'పై ఫోకస్ పెట్టారని సమాచారం. దాంతో.. రామ్‌చరణ్ సినిమా ఆలస్యం అవుతోందని చెబుతున్నారు సినిమా విశ్లేషకులు. కాగా.. ఈ చిత్రం తర్వాత 'ఉప్పెన' మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించబోతున్నారు.