ఏటీఎం సెంటర్‌ను బెడ్రూంగా మార్చేసుకున్న ముగ్గురు వ్యక్తులు (వీడియో)
ముగ్గురు వ్యక్తులు ఏటీఎం సెంటర్‌లో హల్‌చల్ చేశారు.
By Srikanth Gundamalla Published on 12 Jun 2024 2:42 PM ISTఏటీఎం సెంటర్‌ను బెడ్రూంగా మార్చేసుకున్న ముగ్గురు వ్యక్తులు (వీడియో)
ముగ్గురు వ్యక్తులు ఏటీఎం సెంటర్‌లో హల్‌చల్ చేశారు. పంజాబ్‌లోని పాటియాలలో ఒక వ్యక్తి ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసేందుకు లోనకి వెళ్లి చూసి షాక్ అయ్యాడు. ముగ్గురు వ్యక్తులు ఏటీఎం సెంటర్‌లో పడుకుని ఉన్నారు. తాను డబ్బులు తీసుకోవడానికి వచ్చాననీ.. అసలు మీరిక్కడ ఎందుకు పడుకున్నారని ప్రశ్నించాడు. దానికి ఆ ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ... అక్కడి నుంచి అస్సలు లేవలేదు. కావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్లండి అంటూ అలాగే పడుకుని ఉన్నారు. వారి వద్ద మద్యం సీసాలు కూడా కనిపించడంతో ఆ వ్యక్తి ఆగ్రహం చేశాడు. తాగుబోతుల వ్యవహారాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ తర్వాత సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసి.. పాటియాలలో ఏటీఎం సెంటర్ల పరిస్థితి ఇలా ఉందంటూ ట్యాగ్ చేశాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైర్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల తీరుని తప్పుబడుతున్నారు.
ఏటీఎంకు సెక్యూరిటీ గార్డులు ఉంటారనీ.. ఈ ఏటీఎంకు ఎందుకు లేడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఒంటరిగా వెళ్తున్న మహిళ డబ్బుల కోసం ఏటీఎంను సందర్శిస్తే పరిస్థితేంటి అంటూ నిలదీస్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికే అలా చేశారమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన ఎస్‌బీఐ బ్యాంకు.. సమీప బ్రాంచ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని.. తద్వారా చర్యలు తీసుకోబడతాయని వెల్లడించింది.
Scorching Heat Drives People to Seek Shelter in Bank ATM - #Patiala pic.twitter.com/7mFDUc8ZUZ
— Gagandeep Singh (@Gagan4344) June 11, 2024