ఆఫీస్‌ బాయ్‌ సహా ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని

ర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ తమ ఉద్యోగులకు కార్లను సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  4 Nov 2023 7:14 AM IST
pharma company, gift cars, employess,  haryana,

ఆఫీస్‌ బాయ్‌ సహా ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని 

పండుగల సందర్భంగా.. లేదంటే కంపెనీ యానివర్సరీ సందర్భంగా జీతాలు పెంచడం లేదంటే బోనస్‌ ఇవ్వడమో చేస్తే ఉద్యోగులంతా చాలా సంబరపడిపోతారు. ఇక అలాంటిది వారు పనిచేస్తున్న కంపెనీ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తే. ఊహించని విధంగా లక్షల రూపాయలు విలువ చేసే కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇస్తే..! ఊహించడానికి చాలా హ్యాపీగా ఉంది కదా. అయితే.. ఇది నిజంగానే జరిగింది. హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ తమ ఉద్యోగులకు కార్లను సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చింది.

హర్యానాలోని పంచకులలోని మిట్స్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా సంస్థ డైరెక్టర్‌ ఎంకే భాటియా తన ఉద్యోగులకు టాటా పంచ్‌ కార్లను కానుకగా అందజేశారు. కంపెనీలో ఉద్యోగులే కీలకం అని వారు లేకపోతే ఏదీ లేదంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వారే తమ సెలబ్రిటీలుగా మోసేశారు. ఇక మంచి తీరు కనబర్చిన 12 మందికి ఎంకే భాటియా కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. మరికొందరికి భవిష్యత్‌లో ఇస్తానంటూ ఉత్సాహాన్ని నింపారు. ఉద్యోగులకు టాటా పంచ్‌ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే.. వీరిలో ఆఫీస్‌ బాయ్‌ కూడా ఉన్నాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఫార్మా సంస్థ డైరెక్టర్‌ ఎంకే భాటియా తన విజయంలో ఉద్యోగులదే కీలకపాత్ర అని చెప్పారు. వారి శ్రమతోనే కంపెనీ ఎదుగుదల సాధ్యమైందని అన్నారు. కార్లను గిఫ్ట్‌గా పొందినవారిలో కొందరు కంపెనీ ప్రారంభం నుంచి ఆయన వెంటే ఉన్నట్లు వెల్లడించారు. కార్లు కేవలం దీపావళి కానుకలు కాదని.. కంపెనీపై తన ఉద్యోగులు చూపించిన నిబద్ధత, విశ్వాసిని బహుమతులు అని భాటియా పేర్కొన్నారు. కార్లు గిఫ్ట్‌గా పొందినవారిలో ఎలా నడపాలో కూడా తెలియదట. తమకు కంపెనీ కారు గిఫ్ట్‌గా వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సంతోష పడుతున్నారు.

కాగా.. మిట్స్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా సంస్థ డైరెక్టర్‌ ఎంకే భాటియా నెల రోజుల క్రితమే ఆయన ఉద్యోగులకు అందజేసిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కానీ ఈ వార్త ఇప్పుడే ప్రచారంలోకి వచ్చింది. వైరల్‌గా మారింది. భాటియా గిఫ్ట్‌గా ఇచ్చిన టాటా పంచ్‌ కారు 2021లో విడుదలైంది. దీని విలువ రూ.6లక్షలకు పైగా ఉంటుంది.

Next Story