అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. దేవదూతల్లా కాపాడిన పోలీసులు
ముంబై - అటల్ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 9:00 AM ISTఅటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. దేవదూతల్లా కాపాడిన పోలీసులు
ముంబై - అటల్ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెను క్షేమంగా కాపాడారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అటల్ సేతు బ్రిడ్జి భారత్‌లో ఇటీవల ప్రారంభమైనా మంచి ప్రాచుర్యం పొందింది. అయితే.. ఒక మహిళ క్యాబ్‌లో వెళ్తూ అటల్ సేతు బ్రిడ్జిప ఆగింది. ఆ తర్వాత క్యాబ్ దిగి అటల్ సేతు బ్రిడ్జి రేలింగ్ అంచున ప్రమాదకరంగా కూర్చొని ఉంది. క్యాబ్ డ్రైవర్ ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆమెను కిందకు దించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ.. ఆమె వినలేదు. చివరకు అక్కడి నుంచి కిందకు దూకే ప్రయత్నం చేసింది. క్షణంలోనే స్పందించిన క్యాబ్ డ్రైవర్ ఆమెను పట్టుకున్నాడు. ఆ తర్వాత దేవదూతల్లా పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. ఆమెను పట్టుకుని పైకి లాగారు. సురక్షితంగా కాపాడారు. ఇదంతా అటల్ సేతు బ్రిడ్జిపై ఉన్న ఒక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్యాబ్ డ్రైవర్, ట్రాఫిక్ పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా.. పోలీసులు కాపాడిన మహిళను ములుంద్‌లో నివాసం ఉండే 56 ఏళ్ల రీమా ముఖేష్ పటేల్‌గా గుర్తించారు.
కాగా.. సీసీ కెమెరాల్లో సదురు మహిళ చేస్తున్న పనిని గుర్తించిన పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ తర్వాత వెంటనే పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు ఆమె వద్దకు వెళ్లే సరికి దూకేసింది. కానీ.. క్యాబ్ డ్రైవర్ , ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సకాలంలో ఆమెను పట్టుకుని రక్షించగలిగారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై - అటల్ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెను క్షేమంగా కాపాడారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. pic.twitter.com/AqnEbyKxD2
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 17, 2024