హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారు: మల్లారెడ్డి
హైదరాబాద్‌లో 'యానిమల్' సినిమా ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 11:54 AM IST
హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారు: మల్లారెడ్డి
హైదరాబాద్‌లో 'యానిమల్' సినిమా ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌ను మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి మల్లారెడ్డి, సూపర్ స్టార్ మహేశ్ బాబు పాల్గొన్నారు. బాలీవుడ్ హీరో రణ్‌బీఆర్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారని పేర్కొన్నారు. అంతేకాదు.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ కూడా త్వరలో హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాడని చెప్పారు మల్లారెడ్డి. ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రణ్‌బీర్ కపూర్, సందీప్ వంగా కాంబినేషన్‌లో వస్తోన్న యానిమల్ సినిమా డిసెంబర్ 1న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మల్లారెడ్డి, మహేశ్ బాబుతో పాటు.. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ పెద్ద ఈవెంట్ హిందీలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారని అన్నారు. రణ్‌బీర్ కపూర్ కూడా త్వరలో హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతారని చెప్పారు. ఎందుకంటే ముంబై పాతబడిపోయింది.. బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ.. హైదరాబాద్ మాత్రమే అన్నింటికీ అనువుగా ఉన్న నగరం అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
అలాగే తెలుగు ప్రజలు చాలా తెలివైనవారనీ ఈ సందర్భంగా చెప్పారు. తెలుగు దర్శకుడు రాజమౌలి, నిర్మాత దిల్ రాజ్ చాలా తెలివిగా సినిమాలు తీస్తారని చెప్పారు. వీరి జాబితాలోకి తాజాగా సందీప్‌రెడ్డి వంగా కూడా చేరారని అన్నారు మల్లారెడ్డి. అలాగే రష్మిక కూడా తెలివైన అమ్మాయని చెప్పారు. గతంలో పుష్పతో అల్లు అర్జున్ దుమ్ము రేపాడనీ.. మరోసారి సందీప్‌వంగా బాలీవుడ్‌లో దుమ్ము రేపబోతున్నాడని అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారనీ చెప్పారు. ఇక్కడ నుంచి రిలీజ్ అయిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతాయని.. అలాగే యానిమల్ మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
#MallaReddy Speech at #AnimalPreReleaseEvent pic.twitter.com/5s1g82BtPA
— Divya Pendyala (@divya_pendyala) November 28, 2023