మెట్రోలో మంచూరియా తిన్న వ్యక్తికి ఊహించని షాక్..!

మెట్రో రైల్‌లో మంచూరియా తిన్న వ్యక్తికి యాజమాన్యం ఊహించని షాక్‌ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  6 Oct 2023 5:03 PM IST
Man, eat manchurian,  bangalore, metro train, fined,

మెట్రోలో మంచూరియా తిన్న వ్యక్తికి ఊహించని షాక్..!

బెంగళూరు మెట్రో రైల్‌లోకి ఓ వ్యక్తి ఆహారాన్ని తీసుకెళ్లాడు. పక్కన ఎవరూ లేని సమయం చూసి.. బాక్స్‌ తీశాడు. వెంట తెచ్చుకున్న మంచూరియాను ఎంచక్కా తినేశాడు. బయట తినేందుకు సమయం లేదు కాబోలు.. మెట్రో ప్రయాణం చేస్తూ సమయం వృధా చేసుకోకుండా ట్రైన్‌లోనే తినేశాడు. అయితే.. అతనలా మెట్రోలో మంచూరియా తింటుండగా కొందరు వీడియో తీశారు. మంచూరియా తింటున్న వ్యక్తి కెమెరాకు ఫోజులిస్తూ మరి తిన్నాడు. తర్వాత ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా వైరల్‌ అయ్యింది. చివరకు మెట్రో అధికారులు సుదరు ప్రయాణికుడికి ఊహించని షాక్‌ ఇచ్చారు.

నగర మెట్రో రైళ్లలో నిబంధనల ప్రకారం ఆహారం తినడం.. ప్లాట్‌ఫారంలపై భోజనం చేయడం నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయం సదురు వ్యక్తికి తెలుసో లేదో కానీ.. సిబ్బందికి దొరక్కుండా గోబీ మంచూరియాను ట్రైన్‌లోనికి తీసుకెళ్లి తినేశాడు. సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. అటు తిరిగి ఇటు తిరిగి యామాజన్యం దృష్టికి వెళ్లింది. సదురు ప్రయాణికుడికి మెట్రో యాజమాన్యం షాకిచ్చింది. రూ.500 జరిమానా విధించింది. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘించినందుకు మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ వ్యక్తిపై కేసు కూడా నమోదు అయ్యినట్లు తెలుస్తోంది.

అయితే.. సదురు వ్యక్తి జయనగర్-సంపిగె రోడ్డు స్టేషన్ల మధ్య తరచూ ప్రయాణించే సునీల్‌ కుమార్‌గా గుర్తించారు అధికారులు. అయితే.. ఒక రోజు స్నేహితులతో కలిసి మెట్రోలో ఆఫీసుకి బయల్దేరాడు. దారి మధ్యలో మంచూరియా తీసుకున్నాడు.. దాన్నే మెట్రో రైల్లో భుజించాడు. దాన్ని స్నేహితులు వీడియో తీసి నెట్టింట పెట్టగా వైరల్ అయ్యింది.

Next Story