'సలార్' సినిమాకు పిల్లలకు నో ఎంట్రీ.. గొడవ పెట్టుకున్న మహిళ

డిసెంబర్‌ 22న సలార్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  25 Dec 2023 4:00 PM IST
lady, fight, child,  salaar movie ,

'సలార్' సినిమాకు పిల్లలకు నో ఎంట్రీ.. గొడవ పెట్టుకున్న మహిళ

డిసెంబర్‌ 22న సలార్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్‌ నీల్, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చి ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లలో రికార్డులను తిరగరాస్తోంది. యాక్షన్‌, ఎలివేషన్స్‌ సీన్లకు అయితే ప్రభాస్‌ అభిమానులే కాదు.. సినిమా ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్‌ మూవీకి వెళ్లిన ఓ మహిళ థియేటర్ సిబ్బందితో గొడవ పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే.. సలార్‌ సినిమాకు సెన్సార్‌ బోర్డు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. అయితే.. హిట్‌ టాక్ రావడంతో ఫ్యామిలీ మొత్తం సినిమాకు వెళ్లాలని ఎవరైనా అనుకుంటారు. తాజాగా అదే చేసింది ఓ మహిళ. పిల్లలను కూడా తీసుకుని థియేటరకు వెళ్లింది. ఉప్పల్‌లోని డీఎస్‌ఎల్‌ మాల్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకుంది. సినిమా టైమ్‌కు ఫ్యామిలీతో పాటు పిల్లలను తీసుకెళ్లింది. అక్కడే Cine polis థియేటర్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఇది ఎ సర్టిఫికెట్ మూవీ అని.. పిల్లలకు అనుమతి లేదని చెప్పారు. దాంతో.. ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఎందుకు అనుమతించరూ.. తాను తరచూ వస్తానంటూ వాదించడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అది ఏ సర్టిఫికెట్ మూవీ అని.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే ముందు 18ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి లేదని చెబుతుందని అంటున్నారు .అది గమనించకుండా వచ్చి థియేటర్ సిబ్బందితో గొడవ పెట్టుకోవడంలో లాభం లేదని సూచిస్తున్నారు. ఇక ఈ విషయం ఇప్పుడే తెలుసుకున్నవారు కొందరు పిల్లలకు టికెట్స్ బుక్ చేసిన వారు క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు.

భారీ యాక్షన్‌ సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీకి రూ.178 కోట్లు వసూలు కాగా.. రెండో రోజు ఏకంగా రూ.295 కోట్లు వచ్చాయి. ఇక ఆదివారం మూడో రోజు అయితే రికార్డు స్థాయిలో రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.

Next Story