డాక్టర్‌ ఫీజుగా రూ.500 ఫేక్‌ నోట్‌ ఇచ్చిన రోగి.. చివరకు

ఓ రోగి డాక్టర్‌ను కలిశాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.500 ఫేక్ నోటు ఇచ్చాడు.

By Srikanth Gundamalla  Published on  9 July 2023 6:43 AM GMT
Fake, Rs 500 Note, Doctor Fee, Viral,

డాక్టర్‌ ఫీజుగా రూ.500 ఫేక్‌ నోట్‌ ఇచ్చిన రోగి.. చివరకు

ఈ మధ్య కాలంలో డిజిటల్‌ పేమెంట్లు పెరిగిపోయాయి. చిన్న దుకాణానికి వెళ్లినా అక్కడ యూపీఐ స్కానర్లు ఉంటాయి. వినియోగదారులు ఎంచక్కా స్కాన్‌ చేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసేస్తున్నారు. నగదు ఎవరూ పెద్దగా వినియోగించడం లేదు. నగదు రూపంలో నోట్లను వినియోగించే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఓ రోగి డాక్టర్‌ను కలిశాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.500 నోటు ఇచ్చాడు. అయితే.. అది ఫేక్‌ నోటు. చూసుకోని వైద్యుడు, అతని సిబ్బంది తీసేసుకున్నారు.

రోగి నోటు ఇచ్చినప్పుడు అది నకిలీదని వైద్యుడు గుర్తించలేకపోయాడు. సదురు డాక్టర్ ఈ విషయాన్ని ఫోటోతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త వైరల్‌ అవుతోంది. ఇది నకిలీ నోటు అని.. ఆ పేషెంట్‌కు కూడా తెలిసి ఉండకపోవచ్చని అని రాసుకొచ్చాడు. రోగికి మరెవరో ఇచ్చి ఉంటారు తెలియకుండా తీసుకొచ్చి తనకు ఇచ్చాడని డాక్టర్‌ మానవ్‌ అరోరా తన పోస్టులో చెప్పుకొచ్చారు.

డాక్టర్ మానవ్‌ అరోరా ఆర్థోపెడిక్ సర్జన్‌. ఇటీవల ఆయన దగ్గరికి ఓ రోగి వెళ్లాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.500 నోటు ఇచ్చాడు. ఆ సమయంలో నోటుని రిసెప్షనిస్ట్‌ చెక్‌ చేయకుండా తీసుకుంది. సదురు రోగి డాక్టర్‌ను కలిసి, మందులు కూడా రాయించుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత సాయంత్రం డబ్బులు లెక్కించిన సమయంలో డాక్టర్‌, రిసెప్షనిస్ట్‌ నకిలీ నోటుని గుర్తించారు. ఒక రోగి ఇచ్చినట్లు నిర్ధారించుకున్నారు. దాంతో.. తాను మోసపోయానని గుర్తు చేసుకుని డాక్టర్‌ మానవ్‌ అరోరా నవ్వుకున్నాడట. ఇదే విషయం ట్విట్టర్‌లో వెల్లడించాడు. నకిలీ నోటుని భద్రంగా దాచుకుంటానని డాక్టర్ మానవ్ అరోరా చెప్పాడు. ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు రకకాల కామెంట్స్ చేస్తున్నారు. తమకు తెలియకుండా ఇలా చాలా ఫేక్‌ నోట్లు చలమాణీలో ఉంటాయని చెప్పారు. స్పోర్టీవ్‌గా తీసుకున్న డాక్టర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.

Next Story