మెట్రోలో యువకుడి చెంప చెల్లుమనిపించిన యువతి..వీడియో వైరల్
ఢిల్లీ మెట్రోలో మరో సంఘటన జరిగింది. ఓ యువతి యువకుడి చెంప చెల్లుమనిపించింది.
By Srikanth Gundamalla
మెట్రోలో యువకుడి చెంప చెల్లుమనిపించిన యువతి..వీడియో వైరల్
ఢిల్లీ మెట్రో అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలు అనేక వైరల్ వీడియోలు దర్శనమిస్తాయి. వైరల్ వీడియోలకు ఢిల్లీ మెట్రో కేరాఫ్‌గా మారింది మరి. యువతి బికినీ వేసుకుని ప్రయాణం చేసినప్పటి నుంచి వరుస సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు ప్రేమికులైతే బరితెగించి రొమాన్స్ చేశారు. ఇంకొందరు అయితే గొడవపడి కొట్టుకున్నారు కూడా. తాజాగా ఢిల్లీ మెట్రోలో మరో సంఘటన జరిగింది. ఓ యువతి యువకుడి చెంప చెల్లుమనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
ఢిల్లీలో మెట్రోలో జరిగే రోజుకో వీడియో నెట్టంట వైరల్ అవుతోంది. తాజాగా ఓ యువతి యువకుడిపై చేయి చేసుకుంది. ఒక యువతి, యువకుడు మెట్రోలో నిలబడి ఉన్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగింది. ఉన్నట్లుండి యువతి అతడిపై చెంప మీద ఒక్కటి ఇచ్చింది. అయితే.. యువకుడు మాత్రం ఎదురేమీ మాట్లాడకుండా అలాగే నిల్చుని ఉన్నాడు. ఇంత జరుగుతున్నా తోటి ప్రయాణికులు ఏం జరిగిందని కూడా అడగలేదు. మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోయారు. అక్కడే ఉన్న ఒకరు దీన్ని వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా అది వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గొడవ ఏదైనా కానీ యువతి అంతమందిలో కొట్టడం సరికాదని అంటున్నారు. అదే పని రిటర్న్‌గా యువకుడు చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని అంటున్నారు. ఇక మరికొందరు అయితే.. యువతిని అనకూడని మాటలు అని ఉంటాడని అందుకే అలా రియాక్ట్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఢిల్లీ మెట్రో ద్వారా ఎంటర్‌టైన్మెంట్ మాత్రం దొరకుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) - Girl slaps him too hard just think if it was vice-versa😀 pic.twitter.com/Y0RiKeYWem
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 3, 2023