బాగా నిద్ర పోయింది.. చివరకు రూ.9లక్షలు గెలిచిన మహిళ

ఉద్యోగం చదువులు, కెరియర్, బిజినెస్‌ అంటూ పరుగులు పెడుతున్నారు.

By Srikanth Gundamalla  Published on  24 Sept 2024 3:15 PM IST
బాగా నిద్ర పోయింది.. చివరకు రూ.9లక్షలు గెలిచిన మహిళ

ఉద్యోగం చదువులు, కెరియర్, బిజినెస్‌ అంటూ పరుగులు పెడుతున్నారు. ఈ బిజీ లైఫ్‌లో చాలా మంది సరిగ్గా నిద్రకూడా పోవడం లేదు. అతి తక్కువ టైమ్‌ నిద్రపోవడాని కేటాయిస్తున్నారు. కావాల్సినంత సమయం నిద్ర పోకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిసినా.. చాలా మంది దీన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. అయితే.. కొందరు మాత్రం నిద్రకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాస్త సమయం దొరికినా గుర్రుపెట్టి నిద్రపోతారు. తాజాగా ఓ మహిళ నిద్ర పోవడం ద్వారా లక్కీగా మారిపోయింది. ఏకంగా 9 లక్షల రూపాయలను గెలుచుకుంది.

బెంగళూరుకు చెందిన ఓ మహిళ నిద్రపోయి 9 లక్షల రూపాయలు గెలుచుకుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ అయిన సాయిశ్వరి బాగా నిద్రపోతుంది. ఈమెకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తనకున్న ఈ హాబిట్‌ను డబ్బుగా మలుచుకోవాలని చూసింది. ఇటీవల ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించింది. దీని కోసం 12 మంది అభ్యర్థులు కంపెనీ ప్రతినిధులను కలిశారు. కానీ.. అందులో సాయిశ్వరి మాత్రమే ఎంపిక అయ్యింది. అయితే.. ఇంట్న్‌షిప్‌లో భాగంగా కంపెనీ తయారు చేస్తున్న పరుపులపై రోజూ 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. ఇలా రెండు నెలలపాటు చేయాలి. ఇందుకోసం సదురు కంపెనీ ఆమెకు 9 లక్షల రూపాయలు ఇచ్చుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఇక నిద్ర అంటేనే ఎంతో ఇష్టపడే సాయిశ్వరి హాయిగా తిని ఈజీగా రోజూ 9 గంటల పాటు నిద్రపోయింది. దాంతో.. చివరకు రూ.9 లక్షల రూపాయలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story