ఇది కదా టైమింగ్ అంటే..ట్రాఫిక్‌లోనూ ఆన్‌టైమ్‌లో పిజ్జా డెలివరీ..!

బెంగళూరులో ఓ పిజ్జా డెలివరీ బాయ్‌ ట్రాఫిక్‌లో ఇరుకున్న వ్యక్తికి కూడా ఆన్‌టైమ్‌లో ఆర్డర్‌ అందించాడు.

By Srikanth Gundamalla  Published on  28 Sept 2023 7:15 PM IST
Banglore, pizza, delivery boy, ontime delivery,  traffic,

 ఇది కదా టైమింగ్ అంటే..ట్రాఫిక్‌లోనూ ఆన్‌టైమ్‌లో పిజ్జా డెలివరీ..!

చాలా మంది ఇప్పుడు ఇష్టమైన ఫుడ్‌ తినాలంటే వండుకోవడం లేదు. ఎందుకు కష్టపడటం.. ఆన్‌లైన్‌లో అలా ఆర్డర్‌ పెడితే ఇలా వచ్చేస్తుందని భావిస్తున్నారు. నగరాల్లో ఉండే జనం దాదాపుగా ఇలానే ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకునే తింటున్నారు. అయితే.. సమయం కూడా సేవ్‌ అవుతుందని భావిస్తున్నారు. కాగా.. తాజాగా ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ టైమింగ్‌ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

లాంగ్‌ వీకెండ్‌ ఇది. దాంతో.. బెంగళూరులో ఉన్న టెకీలంతా ఇంటి బాటపట్టారు. ఈ కారణంగా బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. అదే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు ఓ వ్యక్తి. ఎంతకీ వెహికిల్స్‌ ముందుకు కదలడం లేదు. ఇప్పట్లో ఇంటికి చేరుకునేది లేదని గ్రహించిన రిషివత్స అనే వ్యక్తి.. ఆకలేస్తుంది ఏదైనా తింటే ఓ పనైపోతుందని భావించాడు. ఎలాగూ ముందుకు కదలడం లేదని అనుకున్నాడు కాబట్టి.. వెంటనే ఫోన్‌ తీసి డామినోస్‌ ద్వారా పిజ్జా ఆర్డర్‌ చేసి లైవ్‌ లొకేషన్‌ పెట్టాడు. ఆర్డర్‌ అయితే పెట్టాడు కానీ.. పూర్తిగా ట్రాఫిక్‌ ఉంది కాబట్టి డెలివరీ బాయ్‌ చేరుకోలేడేమో అని భావించాడు. ఫోన్‌లో చూస్తేనేమో పిజ్జా మరో అరగంటలో డెలివరీ చేస్తారని ఉంది. అది చూసి నవ్వుకున్నాడు కూడా.

అయితే.. సదురు వ్యక్తి ఊహించని విధంగా పిజ్జా డెలివరీ బాయ్‌ అంత ట్రాఫిక్‌ జామ్‌లో కూడా ప్రామిస్ చేసినట్లుగా అరగంటలోనే పిజ్జా డెలివరీ చేశాడు. దాంతో.. అతడు ట్రాఫిక్‌లోనూ ఆన్‌టైమ్‌కి డెలివరీ చేయడంతో సదురు కస్టమర్‌ ఆశ్చర్యపోయాడు. దాంతో.. వెంటనే ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేసి రికార్డు చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అతనికి జరిగిన అనుభవాన్ని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పిజ్జా డెలివరీ బాయ్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇంకొందరు తమకు ఎదరైన చేదు అనుభవాన్ని గుర్తు కామెంట్స్‌లో పెడుతున్నారు.

Next Story