బెంగళూరులో ఆటో వాళ్లతో జాగ్రత్త! ఇంత మోసమా? (వీడియో)

బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్‌ చేసిన మోసం మామూలుగా లేదు. కళ్లముందే మ్యాజిక్ చేసినట్లు డబ్బులు మాయం చేశాడు.

By Srikanth Gundamalla  Published on  6 Sep 2023 4:58 AM GMT
Bangalore, Auto Driver, cheat,  Customer,

బెంగళూరులో ఆటో వాళ్లతో జాగ్రత్త! ఇంత మోసమా? (వీడియో)

ఎక్కడికైనా టూర్లకు వెళ్తే దాదాపుగా అందరూ సొంత వెహికిల్స్‌లోనే వెళ్తారు. ఒక వేళ ఫ్లైట్‌కి లేదా ట్రైన్‌కు వెళ్లిన వారు.. పర్యాటక ప్రాంతాల్లో క్యాబ్‌, ఆటోలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇక కొత్త మనుషులను చూడగానే కొందరు క్యాబ్, ఆటో డ్రైవర్లు మోసాలకు పాల్పడతారు. ఎక్కువ మొత్తం డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్‌ చేసిన మోసం మామూలుగా లేదు. కళ్లముందే మ్యాజిక్ చేసినట్లు డబ్బులు మాయం చేశాడు.

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యూట్యూబర్‌ ఎండీ ఫిజ్. అతను ఇటీవల భారత్‌కు వచ్చాడు. ఆయన బెంగళూరుకు వెళ్లాడు. పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆటో ఎక్కాడు. ప్రయాణం పూర్తయ్యాక.. మీటర్ రూ.300 అవుతుంది. ఆటో దిగి ఫిజ్ డ్రైవర్‌ చేతికి రూ.500 ఇచ్చాడు. అలా ఇచ్చిన నోటుని కనురెప్పపాటులో చేతికి మడతపెట్టిన షర్ట్‌లో దాచాడు. ఆ తర్వాత అప్పటికే తన చేతిలో సిద్ధంగా ఉన్న వంద రూపాయల నోటు చూపించి.. ఇదే ఇచ్చావు ఇంకో రూ.200 ఇవ్వాలని చెప్పాడు. తన దగ్గర అదే ఉంది.. ఇంకో నోటు లేదంటూ ఖాళీ చేతులు చూపించాడు. దాంతో.. ఫిజ్‌ కూడా షాక్‌ అయ్యాడు. తానే పొరపాటున రూ.100 నోటు ఇచ్చానని భావించి.. వెంటనే మరో రూ.500 ఇచ్చాడు. చిల్లర తిరిగి ఇవ్వబోతుండగా డ్రైవర్‌ను చిల్లర ఉంచుకోమని చెప్పాడు ఫిజ్. విచిత్రం ఏంటంటే ప్రయాణం మోత్తాన్ని ఫిజ్‌ వీడియో తీశాడు. వీడియో రికార్డు అవుతుందన్న విషయం తెలిసి కూడా ఆటో డ్రైవర్ మోసానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ విషయం ఫిజ్‌కు వీడియో ఎడిట్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తున్న సమయంలో తెలిసింది.

ఇక మోసాన్ని గుర్తించి ఫిజ్‌ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. బెంగళూరులో ఈ డ్రైవర్‌ ఆటో ఎక్కొద్దంటూ సూచించాడు. వీడియో చూసిన నెటిజన్లు కూడా బెంగళూరులో ఆటోలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ తమ అనుభవాలను కొందరు పంచుకుంటున్నారు. కాగా.. అధిక చార్జీలు వసూలు చేయడం, రైడ్లకు నికారించడం వంటి కారణాలో జులైలో ఏకంగా 722 కేసులు డ్రైవర్లపై నమోదు అయ్యాయి. ఫిజ్‌ను ఆటో డ్రైవర్ ఏ విధంగా మోసం చేశాడో మీరూ ఒకసారి వీడియో చూడండి.

Next Story