చాలా ఏళ్ల తర్వాత అమల డ్యాన్స్.. వీడియో వైరల్

ఎన్నో ఏళ్ల తర్వాత అమల డ్యాన్స్‌ చేశారు. హుషారైన నాగార్జున పాటకే డ్యాన్స్ చేశారు.

By Srikanth Gundamalla
Published on : 3 Sept 2023 8:45 PM IST

Amala, Dance Video, Viral, Nagarjuna Song,

చాలా ఏళ్ల తర్వాత అమల డ్యాన్స్.. వీడియో వైరల్

హీరో నాగార్జున భార్య అమల ఒకప్పుడు హీరోయిన్‌. ఆమె చాలా కాలం పాటు వెండి తెరకు దూరంగానే ఉన్నారు. ఎప్పుడో ఒకసారి తల్లి పాత్రలు చేస్తూ బిగ్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంటారు. అయితే.. ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత అమల డ్యాన్స్‌ చేశారు. హుషారైన నాగార్జున పాటకే డ్యాన్స్ చేశారు.

టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ జోడి జాబితాలో నాగార్జున-అమలది ముందుంటుంది. ఇద్దరు కలిసి శివతో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని రిలయ్‌ లైఫ్‌లోనూ జోడీగా మారారు. పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘మనం’ చిత్రంలో డాన్స్‌ టీచర్‌గా నటించారు. ఆ మధ్య ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో శర్వానంద్‌కు తల్లిగా నటించింది. ఇలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ.. ఎక్కువ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తుంది.

అన్నపూర్ణ ఫిల్మ్‌ కాలేజ్‌లో నిర్వహించిన ఓ వేడుకకు అమల ముఖ్యఅథితిగా హాజరయ్యారు. అక్కడ స్టేజ్‌పై అందరూ ఒక్కో పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ క్రమంలో అమల కూడా నాగార్జున హీరోగా నటించిన 'హలో బ్రదర్‌' సినిమాలో హిట్‌ సాంగ్ ప్రియరాగాలే పాటకు స్టెప్పులేశారు. ఆకట్టుకునే స్టెప్పులతో అలరించారు అమల. ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేడమ్‌ సూపర్బ్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఇంకొందరు అయితే.. నాగార్జున కూడా ఉండి ఉంటే బాగుండేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అమ్మలా అస్సలు కనిపించడం లేదంటూ..ఎవర్‌గ్రీన్‌ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story