ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెకింగ్‌ వద్ద సిబ్బంది చేతివాటం (వీడియో)

పకడ్బందీగా ఉండే చెకింగ్‌ సిబ్బందే ఓ ఎయిర్‌పోర్టులో చేతివాటం ప్రదర్శించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  16 Sept 2023 11:49 AM IST
Airport, officers, Theft money,  passengers luggage,

ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెకింగ్‌ వద్ద సిబ్బంది చేతివాటం (వీడియో)

ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఇతర అక్రమంగా ఏ వస్తువులను దేశ సరిహద్దులను దాటించకుండా అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటారు సెక్యూరిటీ. చెకింగ్‌ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. లగేజ్‌తో పాటు పర్సులు, ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా ఓ బాక్స్‌లో పెట్టి స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అనుమానాస్పదంగా వస్తువులుంటే లోనికి అస్సలు అనుమతించరు. అయితే.. ఇంత పకడ్బందీగా ఉండే చెకింగ్‌ సిబ్బందే ఓ ఎయిర్‌పోర్టులో చేతివాటం ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలోని మయామి ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది ఈ సంఘటన. ప్రయాణికుల బ్యాగులు, పర్సుల్లో నుంచి నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులను కొట్టేశారు. ఈ ఏడాది జూన్ 29న మయామి ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు తమ లగేజీని సెక్యూరిటీ స్కాన్ కోసం మెషిన్ పై పెట్టారు. అక్కడ విధుల్లో ఉన్న ట్రాన్స్ పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులు జోసూ గోంజాలెజ్, లాబరియస్ విలియమ్స్ వాటిని స్కానింగ్ మెషిన్‌లోకి పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న పర్సులో నుంచి 600 డాలర్లను గోంజాలెజ్, మరో ప్రయాణికుడి లగేజీలో నుంచి విలియమ్స్ నగదును కొట్టేశారు. వీరు చోరీ చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీడియో చెక్‌ చేయడంతో సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది.

అయితే.. దీనిపై స్పందించిన పోలీసులు నిందితులను జులైలోనే అరెస్ట్‌ చేశారు. విచారణలో దొంగతనానికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నారు. ఇద్దరూ కలిసి రోజుకు సగటున వెయ్యి డాలర్ల దాకా దొంగతనం చేస్తున్నట్లు అంగీకరించారు. కాగా.. ఈ ఘటనపై మరింత విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story