తమిళనాడులో అమానుషం.. అక్కడ మలవిసర్జన చేశాడని దాడి..

By అంజి  Published on  17 Feb 2020 4:00 AM GMT
తమిళనాడులో అమానుషం.. అక్కడ మలవిసర్జన చేశాడని దాడి..

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి చెందిన భూమిలో మల విసర్జన చేశాడని దాడి చేసి చంపేశారు. ఈ ఘటన విళుపురం జిల్లాలో జరిగింది. శక్తివేల్‌ అనే 26 ఏళ్ల యువకుడు తాను ఉండే గ్రామం శివారులోని పొలంలోకి మలవిసర్జనకు వెళ్లాడు. అక్కడే ఉన్న కొందరు స్థానిక మహిళలు.. శక్తివేల్‌ను మందలించారు. తిరిగి అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో శక్తివేల్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలు అయ్యేలా కొట్టి వదిలారు. కాగా అతడు అప్పటికే అపాస్మరకస్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు శక్తివేల్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే శక్తివేల్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా అగ్రవర్ణాలకు చెందిన వారి పొలంలో మలవిసర్జన చేశాడనే.. కారణంతోనే దాడి చేసి చంపారంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మలవిసర్జన చేసేందుకు వచ్చిన శక్తివేల్‌.. అక్కడే ఉన్న కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందకే కొట్టామని నిందితులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులుగా భావిస్తున్న ముగ్గురు మహిళలు సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారని ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక తెలిపింది. శక్తివేల్‌ మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అక్కడి పోలీసులు తెలిపారు. కారై గ్రామానికి చెందని శక్తివేల్‌.. ఓ పెట్రోల్‌ బంక్‌లో పని చేసేవాడు.

Next Story
Share it