యాత్రా స్పెషల్‌: ప్రతీ శని, ఆదివారాల్లో విజయవాడ టు శ్రీశైలం బస్సు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 10:06 AM GMT
యాత్రా స్పెషల్‌: ప్రతీ శని, ఆదివారాల్లో విజయవాడ టు శ్రీశైలం బస్సు

శ్రీశైలం : యాత్రికుల సౌకర్యార్థం ఏపీ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం శ్రీశైల భ్రమరాంబ మల్లి కార్జున స్వామిల దర్శనార్థం శ్రీశైలం వచ్చారు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్. భక్తుల సౌకర్యార్ధ విజయవాడ నుంచి శ్రీశైలానికి వారంలో రెండు రోజులు బస్సు నడిపితే బాగుంటుందని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. వెంటనే మంత్రి అధికారులను ఆదేశించి ప్యాకేజీ ప్రకటించారు. రాష్ట్రంలోని మూడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ ప్యాకే జీ ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ సందర్శిస్తూ ఈ యాత్ర సాగుతుంది. ఈ ప్యాకేజీ ఈ నెల 12న ప్రారంభమైంది. మొదటిరోజు 18 మంది యాత్రికులు వచ్చారు. 18 మంది యాత్రికులతో మినీ కోచ్‌ 18 సీటర్‌ ఏసీ బస్సులో శ్రీశైలం వచ్చారు. శ్రీశైలంలో టూరిజం శాఖ అతిథి గృహాల్లో స్నానాదికాలను ముగించుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం భోజనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు టూరిజం శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ప్యాకేజీ బాగుందని, ఒకేసారి మూడు క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కలిగిందన్నారు. ఉదయం 5 గంటలకు విజయవాడలో బయలుదేరి శ్రీశైలం వచ్చి స్వామి అమ్మవారల దర్శనం అనంతరం శ్రీశైలం నుంచి త్రిపురాంతకం అక్కడి నుంచి కొటప్పకొండ క్షేత్రాలను దర్శించుకుని తిరిగి రాత్రి 10.30గంటలకు విజయవాడ చేరుకుంటారు.

ప్యాకేజీ వివరాలు

1.విజయవాడ-శ్రీశైలం 18గంటల తీర్థయాత్ర

2.శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వారి దర్శనం

3.కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దర్శనం

4.త్రిపురాంతకం త్రిపురాంతకేశ్వరస్వామి, బాల త్రిపురసుందరీదేవి దర్శనం

5.పెద్దలకు ఒక్కరికి టికెట్‌ ధర రూ.1,990

6.పిల్లలకు ఒక్కరికి టికెట్‌ ధర రూ.1,590

7.క్యూలైన్‌లో వేచి ఉండకుండా శీఘ్ర దర్శనం, ఫ్రెషప్‌ సౌకర్యం

8.టిఫిన్‌, భోజనం, రాత్రి భోజన సౌకర్యం

Next Story
Share it