కరోనా నెగిటివ్ అని ఇంటికి పంపేశారు..మళ్లీ పాజిటివ్ వచ్చిందంటూ..

By రాణి  Published on  27 April 2020 12:40 PM IST
కరోనా నెగిటివ్ అని ఇంటికి పంపేశారు..మళ్లీ పాజిటివ్ వచ్చిందంటూ..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగుల పట్ల వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇటీవలే గుంటూరులో కరోనా నెగిటివ్ పేషెంట్ ను డిశ్చార్జ్ చేయబోయి పాజిటివ్ పేషెంట్ ను డిశ్చార్జ్ చేశారు. ఇదే తరహా ఘటన మరో జిల్లాలో కూడా జరిగింది. తాజాగా విజయవాడకు చెందిన ఓ లారీడ్రైవర్ విషయంలో కూడా వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవలే వృత్తి రీత్యా వేరే ప్రాంతానికి లోడ్ తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన ఓ లారీ డ్రైవర్ తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో స్వచ్ఛందంగా పోలీసులను సంప్రదించి ఆస్పత్రిలో చేరాడు. 10 రోజుల పాటు అతడు క్వారంటైన్ లో ఉండగా..రెండుసార్లు స్వాబ్ టెస్ట్ చేసిన వైద్యులు నెగిటివ్ వచ్చిందని చెప్పి డిశ్చార్జ్ చేశారు. మళ్లీ 24 గంటల్లోపే పాజిటివ్ అని వచ్చిందంటూ అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. దీని వల్ల అతను, అతడి కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడ్డారో అతని మాటల్లోనే..

Also Read : కన్నతల్లితో గొడవ.. ఆ తర్వాత డంబెల్ తో..

'' నా పేరు సురేంద్ర కుమార్. విజయవాడలోని రామలింగేశ్వర్ నగర్ లో ఉంటాను. వృత్తిరీత్యా నేనొక లారీ డ్రైవర్ ని. ఇటీవలే డ్యూటీ నుంచి వచ్చాక నాకు కొన్ని కరోనా లక్షణాలు కనిపించడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాను. అక్కడే 10 రోజులు వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారు. రెండుసార్లు టెస్టులు చేసి..నెగిటివ్ అని ఆ రోజు సాయంత్రం 7 గంటలకు (ఏప్రిల్ 25వ తేదీన) ఇంటికి పంపారు. మర్నాడు 5 గంటలకే పాజిటివ్ అని చెప్పి అంబులెన్స్ లో అవుట్ పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ఇలా జరగటం వల్ల నా కుటుంబం చాలా ఇబ్బంది పడింది. నేను స్వచ్ఛందంగా ఆస్పత్రికి వచ్చినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రి పాలైన పరిస్థితి ఎదురైంది. ఇలా మరొకరి విషయంలో తప్పు జరగకుండా చర్యలు తీసుకుంటారని భావిస్తూ..ఈ వీడియో పెడుతున్నాను.'' అని సురేంద్ర సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు.

Also Read : ఏపీలో ఆగ‌ని క‌రోనా కేసులు.. కొత్త‌గా మ‌రో 80

Next Story