రాముల‌మ్మ... ఆ రెండు సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 10:58 AM GMT
రాముల‌మ్మ... ఆ రెండు సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా..?

రాముల‌మ్మ అని చెప్పినా... లేడీ అమితాబ్ అని చెప్పినా... ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు విజ‌య‌శాంతి. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూర‌మైన విజ‌య‌శాంతి... సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.

Image result for sarileru neekevvaru poster

ఇప్పటికే ఈ సినిమా హీరో, హీరోయిన్‌తో పాటు విజయశాంతిపై కూడా దాదాపు అన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. విజయశాంతి షూటింగ్ లో ఉండగానే..కొంత మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సంప్ర‌దించి త‌మ సినిమాలో న‌టించాల‌ని అడిగార‌ట‌. అంతే కాదండోయ్... మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమాలో సైతం నటించాలని కోరారట.

Image result for vijayashanti

చిరంజీవి అని సినిమా చెప్ప‌గానే వేరే ఆలోచ‌న లేకుండా విజ‌య‌శాంతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ సినిమాలో కూడా విజ‌య‌శాంతి కీలక పాత్రే పోషించ‌నుంద‌ని తెలిసింది. అలాగే ఎఫ్- 2 సీక్వెల్ ఎఫ్- 3లో న‌టించాల‌ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి అడగ‌గా... విజ‌య‌శాంతి అనిల్ రావిపూడి వ‌ర్క్ న‌చ్చి వెంట‌నే ఓకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే.. క‌నుక నిజ‌మైతే... చిరు - కొర‌టాల‌ మూవీ, ఎఫ్- 3 సినిమాల‌కు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Next Story
Share it